ఆపిల్‌ కంప్యూటర్‌ ఖరీదు రూ.11కోట్లు?

11 Feb, 2021 20:47 IST|Sakshi

ఆపిల్ కంప్యూటర్‌ ఖరీదు రూ.11కోట్లు ఎందుకని ఆశ్చర్య పోతున్నారా? దీనిలో అంత స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా. ఇది అన్ని ఆపిల్ కంప్యూటర్ ల మాదిరిగా మాత్రం కాదు. ఈ 'ఆపిల్ -1' కంప్యూటర్ 
ను కంపెనీ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్ కలిసి 1976లో రూపొందించారు. ఆపిల్ సంస్థ నుంచి వచ్చిన తొలి కంప్యూటర్ ఇది. అమెరికాకు చెందిన కృష్ణ బ్లేక్ అనే వ్యక్తి 1978లో ఈ 'ఆపిల్ -1' కంప్యూటర్ ను సుమారు 666 డాలర్లకు కొనుగోలు చేశారు. ఇది ఇంకా పనిచేస్తుండటం విశేషం. 

చెక్క కేసుతో తయారు చేసిన 'ఆపిల్ -1' కంప్యూటర్ ప్రస్తుతం ఈ-బేలో1,500,000 డాలర్లకు(సుమారు రూ.11 కోట్లు) అమ్మకానికి ఉంది. 1976లో తీసుకొచ్చిన అసలు ధర కంటే ప్రస్తుతం 2,250 రెట్లు ఎక్కువ. షిప్పింగ్‌ ఛార్జి 450 డాలర్లు(రూ.32వేలు) అదనం. ఎవరైనా విదేశీయులు కొనుగోలు చేస్తే అంతర్జాతీయ ఛార్జీలు వర్తిస్తాయి. దీనితో పాటు ఎలా ఉపయోగించాలో తెలిపే ఒక యూజర్ మాన్యువల్‌ బుక్ కూడా ఉంది. "ఇది చాలా పురాతనమైన, విలువైన వస్తువు కాబట్టి దీన్ని దొంగిలించే ప్రమాదం ఎక్కువగా ఉంది అని ప్రస్తుతం ఫ్లోరిడా బ్యాంక్ ఖజానాలో భద్రపరిచినట్లు" కృష్ణ బ్లేక్ తెలిపారు.

చదవండి:

బిగ్ బ్యాటరీతో వస్తున్న గెలాక్సీ ఎఫ్ 62

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

మరిన్ని వార్తలు