మరోసారి మహిళను కాపాడిన యాపిల్ వాచ్

2 Feb, 2021 14:47 IST|Sakshi

అమెరికా: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మన అరచేతిలోకి వచ్చిందన్న మాట నిజం. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు టెక్నాలజీ ఎంతగానో మేలు చేసింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ టెక్నాలజీ కారణంగానే ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. అలాగే తాజాగా అమెరికాలో జరిగిన ఒక సంఘటన మాత్రం టెక్నాలజీ మనిషికి ఎంత అవసరమో మరోసారి నిరూపించింది. టెక్నాలజీలో స్మార్ట్‌వాచ్‌లు ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాయి. ఇక యాపిల్ వాచ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు.(చదవండి: 5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు రాబోతున్నాయి)

తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో‌ కిడ్నాపర్ల చెర నుంచి మహిళను రక్షించడంలో యాపిల్ స్మార్ట్‌వాచ్ కీలక పాత్ర పోషించింది. టెక్సాస్‌లోని సెల్మాప్రాంతానికి చెందిన ఒక మహిళా తాను ఆపదలో ఉన్నానంటూ తన కూతురికి యాపిల్ వాచ్ ద్వారా SOS కాల్ చేసింది. అయితే ఆమె ఉన్న ప్రదేశం గురుంచి తెలుసుకునే లోపే వాచ్ నుంచి కనెక్షన్ కట్ అయ్యింది. కిడ్నాప్ చేసే సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ కారణంగా ఈ కాల్ కట్ అయ్యింది. కానీ, ఆ మహిళా చేతికి ఉన్న యాపిల్ స్మార్ట్‌వాచ్‌ పనిచేస్తుంది.(చదవండి: ఏసీలు, ఫ్రిజ్‌లు కొనేవారికి షాక్‌!)

దింతో వెంటనే తన కూతురు స్థానిక పోలీసులను ఆశ్రయించింది. యాపిల్ స్మార్ట్‌వాచ్ SOS కాల్ డిస్‌కనెక్ట్ అయినప్పటికీ పోలీసులు ఎమర్జెన్సీ సెల్యూలార్‌ పింగ్ టెక్నాలజీ సాయంతో కిడ్నాప్‌కు గురైన మహిళను ట్రాక్‌ చేశారు. హయత్ ప్లేస్ హోటల్‌లోని ఈస్ట్ సోంటెర్రా బ్లవ్‌డిలోని పార్కింగ్ స్థలంలో కిడ్నాప్ గురైన మహిళా ఒక వాహనంలో కనిపించింది. వెంటనే పోలీసులు బాధిత మహిళను రక్షించి కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆ మహిళ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఆపిల్ వాచ్ ఇలా భయంకరమైన పరిస్థితుల నుంచి వ్యక్తులను కాపాడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం 25 ఏళ్ల వ్యక్తిని గుండెపోటు నుంచి రక్షించింది. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ప్రాణాపాయం నుంచి ఒక వృద్ధుడిని కాపాడింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు