Elon Musk : నువ్వు బతికున్నావనే సంగతి మర్చిపోతుంటాను

15 Nov, 2021 12:17 IST|Sakshi

వాషింగ్టన్‌: టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్‌ మస్క్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి అమెరికా సెనెటర్‌ బెర్నీ సాండర్స్‌ని లక్ష్యంగా చేసుకుని సెటైర్లు వేశాడు ఎలన్‌ మస్క్‌. ఓ నువ్వు ఇంకా బతికు ఉన్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను అంటూ సెటైరికల్‌గా ట్వీట్‌ చేశాడు ఎలన్‌ మస్క్‌. అసలు వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఎందుకు మొదలయ్యింది అంటే..

కొన్ని రోజుల క్రితం ఎలన్‌ మస్క్‌ టెస్లాలో తన పేరిట ఉన్న 6.9 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నాడు. 1.2 మిలియన్‌ షేర్లను అమ్మేశారు. వీటి విలువ 1.2 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువేనని తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా సెనెటర్‌ బెర్నీ సాండర్స్‌ పరోక్షంగా స్పందిస్తూ ‘‘అత్యంత ధనవంతులు వారి వంతు పన్నులను సక్రమంగా చెల్లించాల్సిందిగా మనం డిమాండ్‌ చేయాలి’’ అంటూ ట్వీట్‌ చేశాడు.
(చదవండి: Elon Musk: ఎలన్‌ మస్క్‌కి ఏమైంది, ఎందుకిలా?..)

దీనిపై ఎలన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ‘‘ఓ నువ్వు బతికున్నావనే విషయాన్ని నేను మర్చిపోతుంటాను.. ఇప్పుడేమంటావ్‌.. నేను మరింత స్టాక్‌ అమ్ముకోవాలని నువ్వు కోరుకుంటున్నావా.. చెప్పు’’ అంటూ ఎలన్‌ మస్క్‌ విరుచుకుపడ్డాడు. టెస్లా సీఈఓ ట్వీట్‌పై సాండర్స్‌ ఇంకా స్పందించలేదు. 

అయితే ఎలన్‌ మస్క్‌ స్టాక్‌ విక్రయానికి గత వారం నిర్వహించిన ట్విటర్‌ పోల్‌ ఫలితాలే ప్రధాన కారణమని అనుమానిస్తున్నారు. ఇక మస్క్‌ ప్రస్తుతం అతను 13.3 శాతం అత్యధిక పన్ను రేటు కలిగి ఉన్న కాలిఫోర్నియాకు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడు. ప్రస్తుతం మస్క్‌ రాష్ట్ర ఆదాయపు పన్ను లేని టెక్సాస్‌కు మారినప్పటికీ, అతను ఇప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు ఇటీవలి ట్వీట్‌లో అంగీకరించాడు. ఎందుకంటే అతను ఇప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.
(చదవండి: అన్నంత పని చేసిన ఎలన్‌మస్క్‌.. టెస్లాలో షేర్ల విక్రయం.. కారణమేంటి?)

బిలియనీర్ల విపరీతమైన సంపదపై పన్ను విధించడం సాండర్ విధుల్లో అతి పెద్ద భాగం. సెనేట్ బడ్జెట్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న సాండర్స్ అమెరికాలోని 0.1 శాతం ఉన్న అత్యంత ధనవంతులు కుటుంబాలపై వార్షిక పన్నును ప్రతిపాదించారు. ఇది రాబోయే దశాబ్దంలో సుమారు 4.35 ట్రిలియన్‌ డాలర్లను సమీకరించగలదని.. అంతేకాక రానున్న 15 సంవత్సరాలలో బిలియనీర్ల సంపదను సగానికి తగ్గించగలదని సాండర్స్‌ పేర్కొన్నాడు. అధ్యక్షుడు జో బిడెన్ తీసుకువచ్చిన విస్తృత సామాజిక భద్రతా నికర ప్రణాళికకు నిధులు సమకూర్చడానికి డెమొక్రాట్లు బిలియనీర్లపై పన్ను విధించడానికి ప్రయత్నిస్తున్నారు. 

చదవండి: పేరు మార్చుకున్న ఎలన్‌మస్క్‌.. కారణం ఇదేనా?

మరిన్ని వార్తలు