బతుకు ఆగం జేసిన బొమ్మ తుపాకీ! 30 ఏళ్లు జైల్లో..

5 Jul, 2021 13:54 IST|Sakshi

ఆ పెద్దాయనకు అస్సలు కిస్మత్‌ బాగోలేదు. అందుకే ముప్ఫైఏళ్ల క్రితం బొమ్మ తుపాకీతో బెదిరించి ఓ చోరీ చేశాడు. అదృష్టం బాగోలేక దొరికాడు. అది బొమ్మదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. జీవిత ఖైదులో ముప్పై ఏళ్లు జైల్లోనే మగ్గాడు. చివరికి క్షమాభిక్ష దొరకడంతో జైలు నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యాడు.

రోల్ఫ్‌ కయెస్టెల్‌(70).. అర్కన్‌సస్‌ రాష్ట్రంలో 1981లో ఓ చిరుతిళ్ల షాపులో దొంగతనం చేశాడు. బొమ్మ తుపాకీతో కౌంటర్‌ మీద ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ దొంగతనం కేసులో 40 ఏళ్ల జైలు శిక్ష.. బోనస్‌గా పదిహేను వేల ఫైన్‌ కూడా విధించింది కోర్టు. ఇక తాను చేసింది చిన్నతప్పేనని, క్షమాభిక్ష ప్రసాదించాలని కయెస్టెల్‌ అభ్యర్థిస్తూనే ఉన్నాడు. అంతెందుకు అతని చేతిలో దొపిడీకి గురైన వ్యక్తి కూడా.. వదిలేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు.

  

ఐదుసార్లు క్షమాభిక్ష అప్పీల్‌ చేసుకున్నా అప్లికేషన్‌ను తిరస్కరించారు. సెలబ్రిటీలు సైతం అతని మంచి జీవితానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు నడిపించారు. చివరికి.. ఐదో సారికి అతనికి క్షమాభిక్ష దొరికింది. దీంతో పదేళ్ల ముందుగానే జైలు నుంచి బయటపడుతున్నాడు. అయితే విడుదల కోసం అతను మరో నెల రోజులు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్‌ అసా హచిన్‌సన్‌ చేసిన ‘రోల్ఫ్‌ కయెస్టెల్‌ రిలీజ్‌’ ప్రతిపాదనను జనాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇంతకీ అతను దొంగిలించిన సొమ్ము ఎంతంటే.. 264 డాలర్లు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు