-

Russia Ukraine War: ఆయుధాలు వీడండి.. ఉక్రెయిన్‌ దళాలకు రష్యా స్ట్రెయిట్‌ వార్నింగ్‌

19 Apr, 2022 14:27 IST|Sakshi

ఉక్రెయిన్‌ దళాలకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం ‘‘ఆయుధాల్ని పక్కనపెట్టాలని ఉక్రెయిన్‌ బలగాలను రష్యా హెచ్చరించినట్లు..’ ఏఎఫ్‌పీ న్యూస్‌ ఏజెన్సీ ఒక కథనం ప్రచురించింది. 

రష్యా.. తక్షణమే ఆయుధాలు పక్కన పెట్టాలని ఉక్రేనియన్ బలగాలకు పిలుపునిచ్చింది. అంతేకాదు ముట్టడి చేయబడిన ఓడరేవు నగరం మరియూపోల్ రక్షకులు తమ ప్రతిఘటనను ఆపేయాలని కొత్త అల్టిమేటం జారీ చేసింది. తలాతోకలేని ఉక్రెయిన్‌ యోధుల పోరాటాన్ని ఆపించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను కోరింది రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ. అంతేకాదు.. మరియూపోల్‌లో ఆయుధాల్ని పక్కపెడితే గనుక ఉక్రెయిన్‌ బలగాల ప్రాణాలకు హామీ ఇస్తామని  సున్నితంగా హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల సంక్షోభం 50 రోజులు దాటిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రెండో దశలోకి యుద్ధం అడుగుపెట్టిందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించాడు. ఇక నుంచి యుద్ధం మరింత ముదురుతుందంటూ కామెంట్‌ కూడా చేశాడు. మరోవైపు రష్యా దళాలు తూర్పు భాగంపై పట్టు కోసం తీవ్రంగా యత్నిస్తున్నాయి.

మరిన్ని వార్తలు