అమెరికా 46వ అధ్య‌క్షుడిగా ట్రంప్!

30 Oct, 2020 21:17 IST|Sakshi

వాషింగ్ట‌న్ :  అగ్ర‌రాజ్యం అమెరికా త‌దుప‌రి అధ్య‌క్షుడిగా ఎవ‌రు ప‌గ్గాలు చేజిక్కించుకోనున్నార‌న్న‌ది  ఇప్ప‌డు స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అయితే అమెరికా అధ్య‌క్షుడిగా మ‌రోసారి డొనాల్డ్ ట్రంప్ విజ‌యం సాధిస్తార‌ని  ప్ర‌ముఖ భార‌త జోతిష్కుడు, ఆర్జేడీ మాజీ ప్రతినిధి డాక్టర్ శంకర్ చరణ్ త్రిపాఠి  పేర్కొన్నాడు. తిధిలు, న‌క్ష‌త్రాల‌ను ప‌రిశీలించిన త‌ర్వాత ట్రంప్‌కు గ్ర‌హ స్థానాలు అనుకూలంగా ఉన్నాయ‌ని తెలిపారు. ట్రంప్ జాత‌కాన్ని బ‌ట్టి ఈసారి కూడా ఆయ‌నే  ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తార‌ని విశ్వ‌సాన్ని వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని బీజేపీ అధికార ప్ర‌తినిధి అవ‌ధూత్ వాగ్ సైతం ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు. ట్రంప్ జాత‌కం ప్ర‌కారం బృహ‌స్ప‌తి  సూర్యుడు ఉండే ప‌ద‌వ‌స్థానానికి  ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని ఇది అధికారానికి ప్ర‌తీక అని  చెప్పుకొచ్చారు. మ‌రో ఫ్రెంచ్ జోతిష్కుడు నోస్ట్రాడమస్ కూడా డెమొక్రాట్ అభ్య‌ర్థి జో బిడెన్ కంటే ట్రంప్ ముందంజ‌లో ఉన్నార‌ని పేర్కొన్నారు. (అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫండ్‌ రైజింగ్‌దే కీలకపాత్ర )

మరిన్ని వార్తలు