Independence Day: భారత్‌కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు

15 Aug, 2022 12:40 IST|Sakshi

India celebrates its Independence Day not world But Space Well: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్‌ వ్యోమోగామి రాజా చారి ట్విట్టర్‌లో విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల సందేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్‌ చేశారు. రాజా చారి ఇటీవల ఐఎస్‌ఎస్‌లో ఆరునెలల మిషన్‌ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్‌ చేసిన స్పేఎక్స్‌ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమోగాములలో అతను కూడా ఉ‍న్నారు.

ఈ మేరకు చారి ట్విట్టర్‌లో.... " భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా పూర్వీకుల మూలాలను గుర్తుతెచ్చుకుంటునమ్నాను.  వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్‌ ఈ రోజు మెరిసిపోతుంది. యూఎస్‌లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్‌కి ప్రతిరోజు ఒక వైవిధ్యంగా ఉంటుంది. తాను యూఎస్‌లోని ఇండియన్‌ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నాను. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికి స్వాతంత్య్ర శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. చారి తాతగారిది తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రోఫెసర్‌గా పనిచేశారు. చారి తండ్రి శ్రీనివాస్‌ అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్‌ చదివి ఆ తర్వాత అమెరికా వెళ్లారు.

ఆ తర్వాత చారీ అక్కడే యూఎస్‌లోని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో జన్మించాడు. అయోవాలోని వాటర్‌లూలో కొలంబస్ హై స్కూల్ నుంచి ప్రాధమిక విద్యను, కొలరాడోలోని యూఎస్‌ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశడు. ఆ తర్వాత  అతను కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేస్తున్న రాజా చారి 2017లో వ్యోమోగామిగా ఎంపికయ్యాడు. 

(చదవండి: భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు)

మరిన్ని వార్తలు