అద్భుత చిత్రం సౌర మంట! అత్యంత అరుదుగా కనిపించే దృశ్యం

9 Nov, 2021 14:39 IST|Sakshi

సౌర మంట అనేది సూర్యునిపై అకస్మాత్తుగా పెరిగిన ప్రకాశం, సాధారణంగా ఇది సూర్యని ఉపరితలం వద్ద లేదా సూర్యరశ్మి సమూహానికి దగ్గరగా ఉంటుంది. ఈ మంటల నుంచి రేడియో తరంగాల నుండి గామా కిరణాల వరకు అన్ని రకాల తరంగ దైర్ఘ్యాలు విద్యుదయస్కాంత వర్ణపటం అంతటా వ్యాపించి విద్యుదయస్కాంత వికిరణాన్ని ఉత్పత్తి చేస్తాయి. చాలా దృశ్య  శక్తి  పరిధి వెలుపల ఉన్న పౌనఃపున్యాల ద్వారా ఇది వ్యాపిస్తుంది. వేగవంతమైన చార్జ్‌డ్‌  కణాలు ప్రధానంగా ఎలక్ట్రాన్లు, ప్లాస్మా మాధ్యమంతో సంకర్షణ చెందుతున్నప్పుడు ఈ మంటలు సంభవిస్తాయి.

(చదవండి: అపార్ట్‌మెంట్‌లో మంటలు ...కానీ అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికి!!)

అరోరా అనేది ఒక సహజ విద్యుత్ దృగ్విషయం. ఇది ఆకాశంలో.. ముఖ్యంగా ఉత్తర లేదా దక్షిణ అయస్కాంత ధ్రువం దగ్గర ఎరుపు లేదా ఆకుపచ్చని కాంతికి సంబంధించిన స్ట్రీమర్‌ల రూపాన్ని కలిగి ఉంటుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో దీనిని వరుసగా అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్స్ అరోరా ఆస్ట్రాలిస్ లేదా సదరన్ లైట్స్ అని పిలుస్తారు. అయితే జీవిత కాలంలో ఎప్పుడో అరుదుగా లభించే చిత్రాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి థామస్ పెస్క్వెట్ తీశారు.

అంతేకాదు ఆయన గ్రహం ఉత్తర భాగంలో మిరుమిట్లు గొలిపే అరోరాస్‌ (ఎర్రటి లేదా ఆకుపచ్చ)తో బలమైన సౌర మంట వెలుగుతున్న క్షణాన్ని ఫోటో తీశాడు.పైగా ఈ మండుతున్న సూర్యుని కాంతి భూమి వైపు దూసుకుపోతున్న అద్భుతమైన సమయంలో తీశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఫోటోతోపాటు "మా మిషన్ మొత్తం ఉత్తర అమెరికా నుంచి కెనడా మీదుగా ప్రసరిస్తున్న సౌర కాంతిని చూశాం. అయితే మా కక్ష్య కంటే అద్భుతమైన ఎత్తులో ఆ కాంతి ప్రసరిస్తుంది. మేము తరంగ ధైర్ఘ్యాల మధ్యలో ఉ‍న్నాం" అని పెస్క్వెట్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాదు ఈ ట్వీట్‌కి లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి మీరు చూడండి.

(చదవండి: రెండు రోజులుగా గుహలోనే... పైగా 240 మంది రెస్య్కూ టీం..చివరికి!!)

మరిన్ని వార్తలు