వామ్మో.. ఏంటి ఇదంతా.. సాలీళ్లు ఎంత పనిచేశాయి!

17 Jun, 2021 20:32 IST|Sakshi
పరిసరాలను కమ్మేసిన స్పైడర్‌వెబ్‌(కర్టెసీ: రెడిట్‌)

సిడ్నీ: భారీ తుపాను ధాటి నుంచి ఆగ్నేయ ఆస్ట్రేలియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా సంభవించిన ఆస్తి నష్టం నుంచి తేరుకుని సాధారణ జీవితం గడిపే స్థితికి చేరుకుంటోంది. విద్యుత్‌ కనెక‌్షన్ల పునరుద్ధరణ వంటి చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, విక్టోరియా రాష్ట్రంలోని ఈస్ట్‌ గిప్స్‌ల్యాండ్‌ ప్రజలను వరదల కంటే కూడా సాలీడుగూళ్లే ఎక్కువగా షాక్‌నకు చేస్తున్నాయట.

రోడ్డు పక్కన, చెట్ల మీద, మైదానాల్లో ఎక్కడ చూసినా సాలీడులు అల్లిన గూళ్లే దర్శనమిస్తున్నాయట. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పచ్చిక బయళ్లను కప్పివేసిన భారీ స్ప్రైడర్‌వెబ్స్‌ను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. 

ఎందుకిలా?
ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్లే సమయంలో లేదంటే పొదిగే వేళ సాలీళ్లు వీలైనంత మేర ఎత్తుకు చేరుకునేందుకు ప్రయత్నిస్తాయట. ఆ సమయంలో కాళ్లు పైకెత్తి వందల సంఖ్యలో దారాల(గాసమేర్‌)ను గాల్లోకి విడుస్తాయని, ఈ క్రమంలో వాటంతట అవే త్రికోణాకారంలో పారాచూట్‌ వంటి నిర్మాణాలు ఏర్పరుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ ప్రక్రియను బెలూనింగ్‌ అంటారు. తమను తాము రక్షించేందుకు పెద్ద సాలీళ్లు దీనిని ఉపయోగిస్తాయట. ఈ విషయం గురించి మ్యూజియం విక్టోరియాలో పనిచేసే ఎంటమాలజిస్ట్‌ డాక్టర్‌ కెన్‌ వాకర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇవి చాలా అందంగా ఉన్నాయి. వేగంగా ప్రయాణించేందుకు, ఇతర జీవుల నుంచి తప్పించుకునేందుకు అవి ఇలా చేస్తాయి.

చదవండి: షాకింగ్‌: హిమనీనదాల్లో రక్తం.. ఇదీ అసలు విషయం!

మరిన్ని వార్తలు