చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో మృతదేహం..

3 May, 2023 16:13 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన జరిగింది. కెన్నెడీ నదీ తీరంలో చేపల వేటకు వెళ్లిన కెవిన్ డార్మోడీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను కన్పించకపోవడానికి ముందు అరుపులు, కేకలు విన్పించినట్లు అక్కడున్న వాళ్లు తెలిపారు. దీంతో అధికారులు వెంటనే అతనికోసం సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎలాంటి ఆనవాళ్లు కన్పించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు.

అయితే కెవిన్ అదృశ్యమైన ప్రాంతంలో రెండు భారీ రాక్షస మొసళ్లను గుర్తించారు అధికారులు. అవేమైనా అతడ్ని చంపి తిని ఉంటాయా అనే అనుమానంతో వాటిని షూట్ చేశారు. ఈ రెండు మొసళ్లలో ఒకటి 4.1 మీటర్ల పొడవు ఉండగా.. మరొకటి 2.8 మీటర్ల పొడవు ఉంది. వీటిలో ఓ మొసలి కడుపులో కెవిన్ మృతదేహం లభ్యమైంది. దీంతో అధికారులు అతడ్ని అధికారికంగా ధ్రువీకరించే ప్రక్రియను మొదలుపెట్టారు.

ఇక్కడ ఇలాంటి ఘటన జరగడం రెండోసారి అని జాలర్లు తెలిపారు. గతంలోనూ ఓ వ్యక్తిని మొసళ్లు చంపాయని వెల్లడించారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా.. కెవిన్ వయసు 65 ఏళ్లు. ఓ హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి చాలా కాలంగా చేపలు పట్టడం అలవాటని, ఇందులో ఎదురయ్యే ప్రమాదాల గురించి కూడా బాగా తెలుసుని స్నేహితుడు తెలిపాడు. కానీ కెవిన్‌ ఇలా చనిపోతాడని అసలు ఊహించలేదన్నాడు.
చదవండి: మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్‌లోనే ఇద్దరూ మృతి

మరిన్ని వార్తలు