గూగుల్, ఫేస్‌బుక్‌ వార్తల్ని వాడుకుంటే.. మీడియా సంస్థలకి డబ్బు చెల్లించాలి

26 Feb, 2021 04:53 IST|Sakshi

కొత్త బిల్లుకి ఆస్ట్రేలియా ఆమోదం

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి డిజిటల్‌ ఫ్లాట్‌ఫారమ్‌లు  ఏదైనా మీడియా సంస్థకి చెందిన వార్తల్ని వాడుకుంటే వాటికి డబ్బు  చెల్లిం చాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా పార్ల మెంటు ఒక కీలక బిల్లుకు ఆమోదం వేసింది. న్యూస్‌ మీడియా చట్టానికి చేసిన సవరణల్ని గురువారం ఆస్ట్రేలియా పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆస్ట్రేలియా ట్రెజరర్‌ జోష్‌ ఫ్రైడెన్‌ బెర్గ్,  ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. మొదట్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఫేస్‌బుక్‌ తమ ప్లాట్‌ఫారమ్‌పై ఆస్ట్రేలియా వాసులు వార్తల్ని షేర్‌ చేయడంపై నిషేధాన్ని విధించింది. అయితే ప్రభుత్వం చట్ట సవరణల్లో మార్పులకు అంగీకరించడంతో ఫేస్‌ బుక్‌ వార్తల షేరింగ్‌పై నిషే«ధం ఎత్తి వేసింది.    మరోవైపు ఫేస్‌బుక్, గూగుల్‌ సంస్థలు  మీడియా సంస్థలతో ఒప్పందాలను  కుదుర్చుకుంటున్నాయి. 

మరిన్ని వార్తలు