ఇన్‌హెలర్‌లో దూరిన పాము.. ఇదెలా సాధ్యం!

9 Mar, 2021 18:39 IST|Sakshi

ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన భయానక ఘటన

మెల్‌బోర్న్‌: సాధారణంగా పాములు ఎక్కువగా బొరియల్లో.. బాగా ఉపయోగం లేని చోట.. మనుషుల ఆవాసం లేని ప్రాంతాల్లో కనిపిస్తాయి. కానీ అప్పుడప్పుడు ఇళ్లలోకి, బాత్రూమ్‌లోకి.. ఆఖరికి బ్యాగుల్లోకి కూడా దూరి మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తాయి. పాములు పైన చెప్పిన ప్రాంతాల్లో ఎక్కడ దూరిన మనం గుర్తించవచ్చు.. జాగ్రత్త పడొచ్చు. కానీ ఇన్‌హెలర్‌ లాంటి చిన్న వస్తువుల్లో దూరితే.. కనిపెట్టలేం.. మన అదృష్టం బాగుండకపోతే.. వాటి కాటుకు బలవుతాం కూడా. అసలు పామేంటి.. ఇన్‌హెలర్‌లో దూరడమేంటి.. అసలు అది అందులో ఎలా పడుతుంది వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఇది చదవాల్సిందే. 

ఇన్‌హెలర్‌లో పాము పిల్ల బయటపడిన ఘటన ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్‌లో చోటు చేసుకుంది. అయితే తొలుత ఈ పాము పిల్ల క్వీన్స్‌ల్యాండ్‌లోని ఓ ఇంట్లో బట్టల బాస్కెట్‌లో కనిపించింది. ఆ తర్వాత అది మాయమయ్యింది. ఎలా దూరిందో ఏమో గాని ఇన్‌హెలర్‌లో దూరింది. ఇంటి యజమాని కూతురికి ఆస్తమా. దాంతో ఆమె ఇన్‌హెలర్‌ని తీసుకుని తెరిచి చూడగా.. దానిలో పాము పిల్ల కనిపించింది. భయంతో తల్లిదండ్రులను పిలిచి వారికి ఈ విషయం చెప్పింది.
 

యువతి తల్లిదండ్రులు దీని గురించి పాములు పట్టుకునే వారికి సమాచారం అందించారు. దాంతో సన్‌షైన్ కోస్ట్ స్నేక్ 24/7 సభ్యుడు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఇన్‌హెలర్‌‌లోకి దూరిన పాము పిల్లను బయటకు తీశాడు. ఇక ఇది విషపూరితమైన రెడ్‌ బెల్లిడ్‌ బ్లాక్‌ స్నేక్‌ అని తెలిపారు. ఆస్ట్రేలియాలోని అత్యంత విషపూరిత పాముల్లో ఒకటి. ఇది ఒక్కసారి కాటేస్తే ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవల్సిందే.

చదవండి:
పాముతో ఎలుక ముద్దులాట.. ఇంకేముంది..

ఒక్కసారిగా పాములన్నీ మీద పడ్డాయి!

మరిన్ని వార్తలు