భార్య కళ్లముందే పాముకాటుకు గురయ్యిన వ్యక్తి..ఆ తర్వాత..

30 Jan, 2023 14:44 IST|Sakshi

ఒక్కోసారి కొన్ని విషాద ఘటనలు మన కళ్లముందే జరుగుతుంటాయి. మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం. కానీ ఆ విషాదాన్ని అంత తేలికగా మర్చిపోలేం. అచ్చం అలాంటి భయానక అనుభవాన్ని ఇక్కడొక మహిళ ఎదుర్కొంది. వివరాల్లోకెళ్తే...ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్‌లో ఒక 60 ఏళ్ల వ్యక్తి తన భార్య ముందే విషపూరితమైన పాము కాటుకు గురై మరణించాడు.

అతనికి ఇద్దరు పిల్లలు. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటినా హెలికాప్టర్‌, నాలుగు అంబులెన్స్‌లు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది పాములు బయటకు వచ్చే సీజన్‌ అని చెబుతున్నారు. అక్టోబర్‌  నుంచి ఏప్రిల్‌ నెల సమయం ఉష్ణోగ్రతలు మార్పురావడంతో వేడికి బయటకు వచ్చి ఇళ్లలోకి వచ్చేస్తుంటాయిని చెబుతున్నారు నివాసితులు. ఇక్కడ మృతుడు భార్య ఈ అనుకోని ఘటన జరిగిన వెంటనే సహాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అతను ఒక విషపూరితమైన గోధుమ రంగు పాము కాటుకు గురైనట్లు సమాచారం.

(చదవండి: వివాహం కాకపోయినా పర్లేదు!..పిల్లలను కనండి అంటున్న చైనా!)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు