చావు నోట్లో నుంచి కాపాడిన ‘సమయస్ఫూర్తి’

10 Nov, 2021 10:05 IST|Sakshi

ప్రమాదాలనేవి చెప్పిరావు. ఒక్కొసారి అనూహ్యంగా మన ప్రమేయం లేకుండానే ప్రమాదాలు జరిగిపోతుంటాయి. కానీ అలాంటి సమయంలోనే సమయస్పూర్తితో  వ్యవహరించి ఆ ఆపద నుంచి సురక్షితంగా బయటపడాలి. అచ్చం అలానే చేశాడు ఇక్కడొక ఆస్ట్రేలియన్‌ వ్యక్తి.

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాలోని 60 ఏళ్ల వ్యక్తి  కైర్న్‌స్‌కి సమీపంలోని హోప్ వేల్ నగరంలోని ఒక నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే అతను పని ముగించుకుని తిరిగి  నదిఒడ్డుకి వచ్చే క్రమంలో అక్కడ ఉన్న ఎద్దుని అదిలించాడు. దీంతో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు ఒక మొసలి క్షణాల్లో అతని పై దాడిచేసింది. పైగా ష్యూస్‌ వేసుకుని ఉన్న అతని రెండు కాళ్లను బలంగా లాగడానికి ప్రయత్నించింది.

(చదవండి: పెళ్లి చేసుకున్న మలాల.. ఫోటోలు వైరల్‌)

అతను అక్కడ ఉన్న చెట్టు కొమ్మలను సైతం పట్టుకుని బయటకు రావడానికి ప్రయత్నించాడు. అయితే అతను ఆ ప్రయత్నంలో విఫలం అవ్వడంతో చేసేదేమి లేక చివరికి అతని పాకెట్‌లో ఉన​ కత్తితో అదే పనిగా దాడిచేశాడు.  దీంతో అతను కొద్దిమొత్తంలో గాయాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత అతను ఆసుపత్రికి వెళ్లినట్లు క్వీన్స్‌లాండ్ పర్యావరణ విభాగం పేర్కొంది.

(కష్టపడేతత్వం ఉంటే చాలు... కుటుంబ నేపథ్యం, ఇంగ్లీష్‌ పరిజ్ఞానంతో పని లేదు)

మరిన్ని వార్తలు