ఆస్పత్రి నిర్వాకం...బతికి ఉండగానే మార్చురీకీ... పరీక్షలు చేస్తుండగా....

8 Oct, 2022 17:37 IST|Sakshi

ఒక వ్యక్తిని బతికి ఉండగానే మార్చురీకి పంపించింది ఓ ఆస్పత్రి. చనిపోయింది ఒకరోజు అయితే మరో రోజు చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది. దీంతో ఆస్సత్రి వర్గాలు కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల ఆస్ట్రేలియన్‌ వ్యక్తి రీడ్‌ని యూకేలో పెర్త్‌లోని రాకింగ్‌హామ్‌ ఆస్పత్రి చనిపోయాడని నిర్ధారించి మార్చురీకి తరలించింది. ఐతే సదరు వ్యక్తి మృతదేహాన్ని తరలించడానికి ముందు కుటుంబ సభ్యులుకు సమాచారం కూడా అందించింది. ఐతే ధృవీకరణ పత్రం వెంటనే జారీ చేయలేదు. వాస్తవానికి రీడ్‌ అనే వ్యక్తిని మార్చురుకి సజీవంగా ఉండగానే తరలించారు. ఈ విషయం మార్చురీలో వైద్యులు శవపరీక్ష జరుపుతుండగా బయటపడింది. ఈ మేరకు వైద్యుడు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా  ఆ మృతదేహాన్ని చూసి అనుమానం వచ్చింది.

ఎందుకంటే ఆ మృతదేహం ఉన్న స్థితి చాలా సేపటి క్రితం చనిపోయిన వ్యక్తిలా లేదు కొద్ది నిమిషాల ముందు చనిపోయినట్లు అనిపించింది. పైగా సదరు వ్యక్తి మృతదేహాన్ని ప్యాక్‌ చేసిన కవర్‌ విప్పి ఉందని, కవర్‌పై రక్తం పడి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు వైద్యుడు. బహుశా ఆ వ్యక్తి బతికే ఉండవచ్చని ఆ కవర్‌ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అన్నారు.

అందువల్లే కవర్‌ని ఓపెన్‌ చేసి ఉందని దానిపై రక్తపు మరకలు ఉన్నాయని అన్నారు. పైగా ఆ రక్తం బతికి ఉన్న వ్యక్తి శరీరంలోని రక్తం మాదిరిగా ఉందని అన్నారు. తాము పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చనిపోయి చాలాసేపు కాలేదని, కొద్ది నిమిషాల వ్యవధిలోనే మరణించినట్లు వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో తెలిపారు. అదీగాక అతను సెప్టెంబర్ 5న చనిపోతే...6న చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చింది రాకింగ్‌హామ్‌ ఆస్పత్రి.

దీంతో ఈ ఘటనపై యూకే కరోనరీ కోర్టు దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఆస్పత్రి వర్గాలు ఈ ఘటనను కప్పి పుచ్చుకునేందుకు యత్నించాయి కూడా. అంతేగాదు మరణధృవీకరణ పత్రాన్ని వెనక్కి తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు కోర్టుని అభ్యర్థించాయి కూడా. దీంతో కరోనరి కోర్టు సదరు వ్యక్తి మరణం అసహజంగా ఉందని పోస్ట్‌మార్టం నివేదిక ఆస్పత్రి వర్గాలు చెబుతున్న దానికి భిన్నంగా ఉందంటూ దర్యాప్తు ప్రారంభించటమే కాకుండా బాధ్యులపై కఠిన చర్యుల తీసుకుంటామని స్పష్టం చేసింది.

(చదవండి: విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు)

>
మరిన్ని వార్తలు