ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోని అల్బనీస్‌కు కరోనా పాజిటివ్‌

5 Dec, 2022 13:20 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి.  ఈ తరుణంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షల్లో అ‍ల్బనీస్‌కు పాజివ్‌గా వచ్చింది. ఈ మేరకు ప్రధాని అల్బనీస్‌ మాట్లాడుతూ...తనతో ఉన్నవారిని జాగ్రత్తగా ఉండమని, టెస్టులు చేయించుకోమని సూచించారు. తాను ఐసోలేషన్‌లో ...ఉంటూ ఇంటి నుంచే వర్క్‌ చేస్తానని చెప్పారు.

కాగా, ఫెడరల్‌ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న అల్బనీస్‌ రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఐతే అల్బనీస్‌ లేబర్‌ పార్టీ ఏ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదీగాక అల్బనీస్‌ ఈ నెల 12, 13 తేదీల్లో పాపువా న్యూగినియాకు రెండు రోజుల పర్యటన చేయవలసి ఉంది. 

(చదవండి: పార్లమెంట్‌లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు