Pink Walking Fish: చేతులతో నడిచే అరుదైన గులాబీ చేప..!

24 Dec, 2021 18:39 IST|Sakshi

Rare Pink Hand Fish Spotted In Australia: ఆస్ట్రేలియాలో టాస్మానియన్ తీరంలో తొలిసారిగా అరుదైన చేతులతో నడిచే గులాబీ చేప(పింక్ హ్యాండ్ ఫిష్‌) కనిపించింది. అయితే ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ను గతంలో 1999లో  సముద్రం అడుగున ఈత కొట్టే ఒక డైవర్ గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా టాస్మానియా దక్షిణ తీరానికి 120 మీటర్ల లోతులో ఈ పింక్ హ్యాండ్ ఫిష్‌ని ఆస్ర్టేలియా పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు.

(చదవండి: పెళ్లి చేసుకోవడానికి, పిల్లలను కనడానికి లక్షల్లో రుణాలు!)

 ఈ క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంటార్కిటిక్ అండ్ మెరైన్ స్టడీస్‌కు చెందిన ప్రొఫెసర్ నెవిల్లే బారెట్ అతని బృందం పగడపు పీతలు, చేప జాతులు గురించి సర్వే చేయడానికి మెరైన్ పార్క్ సముద్రగర్భంలో ఒక కెమెరాను ఉంచింది. అయితే ఆ మెరైన్ స్టడీస్ రీసెర్చ్ అసిస్టెంట్ యాష్లీ బాస్టియాన్‌సెన్ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నప్పుడు ఆమె ఈ పింక్ హ్యాండ్‌ఫిష్‌ను గుర్తించింది.

అంతేకాదు ఆ ఫుటేజ్‌లో ఈ పింక్‌ ఫిష్‌ పీతలో దాడి నుంచి తప్పించేకునే నిమిత్తం కంగారుగా వెళ్లుతున్నట్లుగా కనిపించింది. ఈ అత్యధునిక సాంకేతికతో కూడిన కెమెరా తమకు మంచి చిత్రాలతో కూడిన అరుదైన జాతులను గురించి తెలియజేసింది అని ప్రొఫెసర్ బారెట్‌ అన్నారు. అంతేకాదు ఇలాంటి అరుదైన జాతులు లోతైన ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరుచుకుంటాయని చెప్పారు. పైగా ఈ పింక్‌ ఫిష్‌లు అధిక-పరిమాణ చేతులు కలిగి ఉంటాయని అవి సముద్రగర్భం వెంబడి నడవడం, ఈత కొట్టడం వంటివి చేస్తాయని పేర్కొన్నారు.

(చదవండి: పూజారి వేషంలో మాదక ద్రవ్యాల వ్యాపారం... 7 కిలోల గంజాయి పట్టివేత!!)

మరిన్ని వార్తలు