టీచర్‌ మిస్సింగ్‌ కేసు..అసలు విషయం తెలిసి నివ్వెరపోయిన పోలీసులు

24 Jan, 2023 17:35 IST|Sakshi

ఆఫ్రికాలో గతేడాది తప్పిపోయిన ఓ సంగీతం టీచర్‌ దారుణమైన హత్యకు గురయ్యాడు.  తన రూమ్‌మేట్సే అతన్ని కడతేర్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కాంగోలోని బ్రజ్జావిల్లేలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గతేడాది అక్టోబర్‌ 26న ఆస్ట్రేలియన్‌ సంగీత ఉపాధ్యాయుడు మార్క్‌ సియవరెల్ల ఆఫ్రికాలోని కాంగోలో కనిపించకుండాపోయాడు. అప్పటిన నుంచి అంతు చిక్కని మిస్సింగ్‌ కేసుగా ఉండిపోయింది. ఎట్టకేలకు ఆ కేసు చిక్కుముడి వీడింది. కానీ అతడ్ని అంతమొందించిన విధానం విని పోలీసులను ఒక్కసారిగా కంగుతిన్నారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..న్యూసౌత్‌ వేల్స్‌లోని లీటన్‌కు చెందిన 57 ఏళ్ల మార్క్‌ సియవరెల్లా ఆరేళ్ల క్రితం ఆప్రికా దేశానికి వెళ్లాడు. అక్కడ అతను మొదటగా అమెరికన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఇంగ్లీష్‌ తోపాటు సంగీతాన్ని భోధించే ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆ తర్వాత ఇటీవలే ఫ్రెంచ్‌ కాన్సులర్‌ స్కూల్‌కు మారారు. అతను కాంగోలోని బ్రజ్జావిలేలోని అపార్ట్‌మెంట్‌లోన తన స్నేహితుడి కలిసి ఉంటున్నాడు. ఇంతలో అతని పాత సహచరుడు, రూమ్‌మేట్‌ క్లెమెంట్ బెబెకా అనే వ్యక్తి  మార్క్‌ వద్దకు వచ్చాడు.

కాసేపు అక్కడే అపార్ట్‌మెంట్‌లో ముగ్గురు కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇంతలో మార్క్‌ వాష్‌రూమ్‌కి వెళ్లగానే ఆ ఆపార్ట్‌మెంట్‌లో ఉన్న వ్యక్తి మార్క్‌ ఇంకొద్దిరోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు అతని రూమ్‌మేట్‌తో చెప్పాడు. అంతేగాదు అతను ఇక్కడ నుంచి వెళ్లిపోతే మనకేం ప్రయోజనం ఉండదు అని మార్క్‌ రూమ్‌మేట్‌తో అన్నాడు. దీంతో బెబెకా అయితే ఏం చేద్దాం మరీ అని అతడిని అడిగాడు. అందుకని అతన్ని కడతేర్చి అతని వద్ద నుంచి ఎంత కొంత సొమ్ము దుండుకుందా అని సలహ ఇచ్చాడు. 

ఇంతలో మార్క్‌ తాగి వదిలేసిన మందు గ్లాస్‌లో పాయిజన్‌ వేసి అక్కడ టేబుల్‌ మీద ఉంచాడు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వ్యక్తి. ఇంతలో వాష్‌రూమ్‌ నుంచి వచ్చిన మార్క్‌ వారితో మాట్లాడుతూ.. ఆ గ్లాస్‌లోని పాయిజన్‌ని తాగేశాడు. కాసేపటికే స్ప్రుహ తప్పి పడిపోయాడు. దీంతో తామిద్దం మార్క్‌ని ఒక బెడ్‌షీట్‌లో చుట్టి మొసళ్లు అధికంగా ఉండే కాంగో నదిలో పడేశామని బెబెకా చెప్పాడు.

ఐతే మార్క్‌ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు లేవని అతని వద్ద ఉన్న బ్యాంకు కార్డుల సాయంతో డబ్బులు కొట్టేశామని పోలీసలుకు వివరించాడు. కనీసం కుటుంబసభ్యులకు చివరి చూపుకూడా దక్కనీయకుండా అత్యంత ఘోరంగా హతం చేసిన విధానం పోలీసులను షాక్‌ గురి చేసింది. ఈ విషయాన్ని మార్క్‌ కుటుంబసభ్యులు విని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

(చదవండి: కాలిఫోర్నియా కాల్పుల ఘటన: పట్టుబడతానన్న భయంతో నిందితుడు..)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు