3 నెలల పాటు వండారు..  8 నెలలు తిన్నారు

29 Aug, 2022 04:46 IST|Sakshi

వాషింగ్టన్‌:  ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంటి పనులతోపాటు వంట చేయడం పెద్ద ప్రయాసే. దానికోసం చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. కొన్ని నెలలకు సరిపడా ఆహారాన్ని ముందుగానే వండేసి, నిల్వ చేసి పెట్టుకుంటే. మంచి ఆలోచన కదా!  ఆస్ట్రేలియాకు చెందిన కెల్సీ షా (30) అనే గృహిణికి ఇలాంటి ఆలోచనే వచ్చింది. ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాలోని ఇండియానాలో స్థిరపడింది. కుటుంబ సభ్యులకు వండి పెట్టడానికి ఆమెకు చాలా సమయం పట్టేది.

దీంతో ఆహారాన్ని నిల్వ చేసే పద్ధతులపై దృష్టి పెట్టారు. ఇంటర్నెట్‌తోపాటు పుస్తకాల ద్వారా సమాచారం సేకరించారు. ఇందుకోసం రోజుకు 2 గంటలు కేటాయించారు. 3 నెలల పాటు 426 మీల్స్‌ సిద్ధం చేసి, నిల్వచేశారు. కరోనా  ఉధృతంగా ఉన్న సమయంలో ఈ నిల్వ ఆహారమే వారికి దాదాపు 8 నెలలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఉపయోగపడింది. డీహైడ్రేషన్, వాటర్‌ క్యానింగ్‌ పద్ధతుల్లో ఆహారాన్ని చాలారోజులు నిల్వ చేయొచ్చని, తాజాగా ఉంటుందని కెల్సీ షా చెప్పారు. 

మరిన్ని వార్తలు