15 నెలలు..15 ఏళ్లుగా గడిచాయి...ఇక నావల్ల కాదు

14 Apr, 2021 12:36 IST|Sakshi

ఇక పని చేయలేను ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రాజీనామా

పనిభారం ఎక్కువై ఆరోగ్యం దెబ్బతింది: రుడాల్ఫ్‌ అన్సోబెర్

బెర్లిన్‌: అధిక పనితో బాగా అలసి పోయా నంటూ ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రుడాల్ఫ్‌ అన్సోబెర్‌ (60) మంగళవారం పదవికి రాజీనామా చేశారు. పనిభారం ఎక్కువై ఆరోగ్యం దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే విశ్రాంతి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించారని, అందువల్ల రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.   పదవీ కాలంలో ఉన్న 15 నెలలు.. 15 ఏళ్లుగా గడిచాయని పేర్కొన్నారు. కరోనా వచ్చిననాటి నుంచి ప్రభుత్వం తరఫున సూచనలు/సమాచారం అందించేందుకు రుడాల్ఫ్‌ తీవ్రంగా శ్రమించారు.

కాగా జనవరి 2020 నుండి రుడాల్ఫ్ ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. రుడాల్స్‌ రాజీనామాపై ఆస్ట్రియా చాన్సలర్‌ సెబాస్టియన్‌ కుర్జ్‌  ట్విటర్‌ ద్వారా స్పందించించారు.  ఆరోగ్య మంత్రి మొదటినుంచీ బాధ్యతతో వ్యవహరించిన ఆయన  కరోనా మహమ్మారిపై  పోరులో భాగాంగా గత 16 నెలలుగా  దేశం కోసం ఎంతో త్యాగం చేశారని ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు