కాల్పుల విరమణ.. మా బలహీనత కాదు: పాక్‌

5 Feb, 2022 08:25 IST|Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌–పాకిస్తాన్‌ మధ్య గత ఏడాది ఫిబ్రవరి 25న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఒకరి బలంగా, మరొకరి బలహీనతగా చూడరాదని పాకిస్తాన్‌ సైనిక దళాల అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ బాబర్‌ ఇఫ్తికార్‌ అన్నారు. ఈ ఒప్పందం విషయంలో భారత ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణే చేసిన వ్యాఖ్యలను ఆయన శుక్రవారం ఖండించారు. నరవణే వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.

2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూ 2021 ఫిబ్రవరి 25న నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంట కాల్పుల విరమణను పాటించేలా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ నరవణే గురువారం ఢిల్లీలో ఓ సెమినార్‌లో మాట్లాడుతూ.. తాము(భారత సైన్యం) బలమైన స్థానంలో ఉండి చర్చలు జరపడం వల్లే పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పారు.

చదవండి: ఆందోళనకారులపై మిలటరీ అవసరం లేదు


 

మరిన్ని వార్తలు