Turkey-Syria Earthquake: శిథిలాల కిందే ఊపిరిపోసుకుంది..'ఆ జననం ఓ అద్భుతం'

10 Feb, 2023 19:46 IST|Sakshi

తుర్కియే, సిరియాలను భూకంపం ఓ ఊపు ఊపేసింది. ఆ ప్రకృతి విలయం ఇరుదేశాల్లో అంతులేని విషాదాన్ని నింపాయి. దీంతో ఎటూ చూసిన పేకమేడల్లా కూలిని భవనాల కింద చితికిన బతుకులే కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలన్ని అక్కడ ప్రజలకు అంత తేలికగా మర్చిపోలేని ఘోర విషాదాన్ని మిగిల్చాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులో సిరియాలోని జెండెరిస్ పట్టణంలో శిథిలా కింద ఓ ఆడ శిశువు జన్మించడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. ఇలాంటి విషాద సమయంలో జన్మించిన ఆ శిశువు జననం ఒక కొత్త ఆశను రేకెత్తించింది.

సోమవారం సంభవించిన భూకంపం తదనంతరం భద్రతా బలగాలు రెస్క్యూ చర్యలు చేపడుతుండగా..సిరియాలో శిథిలాల కింద ఓ తల్లి ఒక ఆడబిడ్డకి జన్మినిచ్చిన సంగతి తెలిసింది. ఆ శిశువు తల్లి బొడ్డు తాడుకు జత చేయబడి ఉండటంతో సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఐతే ఈ ప్రమాదంలో ఆ చిన్నారి తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్లు అందరూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఆ శిథిలాల కింద గజగజలాడే చలిలో ఓ చిన్నారి ఏడుపును గమనించి రెస్క్యూ టీం అప్రమత్తమై రక్షించారు.

ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో పాపను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో ఓ వైద్యుడి భార్య ఆ చిన్నారికి పాలందించింది. ప్రస్తుతం ఆ చిన్నారిని దత్తత తీసుకునేందుకు పలువురు ముందుకొచ్చారు. ఐతే ఆ చిన్నారి డిశ్చార్జ్‌ అయిన వెంటనే ఇంటికి తీసుకువెళ్తానని ఆమె మేనమామ చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో పుట్టడం విశేషం అంటూ.. ఆ చిన్నారికి అయా అని పేరు పెట్టారు. 'అయా' అనగా అరబిక్‌లో 'అద్భుతం' అని అర్థం. ఆమె జననం ఓ అద్భుతం అంటూ అక్కడ ప్రజలు ఆ శిశువుకి ఈ పేరు పెట్టారు.  
(చదవండి: 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ బిల్‌గేట్స్‌)

>
మరిన్ని వార్తలు