చేపా.. చేపా వాకింగ్‌కు వెళ్దామా?

5 May, 2021 14:48 IST|Sakshi

వాకింగ్‌కు కుక్కలను పట్టుకెళ్లేవాళ్లను చూశాం.. చేపలను వాకింగ్‌కు తీసుకెళ్లడమేంటి.. చోద్యం కాకపోతేనూ..  ఏమో మరి.. జపాన్‌కు చెందిన మా కార్పొరేషన్‌ అయితే.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసేస్తోంది. చిత్రంలో చూశారుగా ఇదే పెంపుడు చేపను వాకింగ్‌కు తీసుకెళ్లే బ్యాగు.. ఇందులో ఆక్సిజన్‌ శాచురేషన్‌ను మెయింటేన్‌ చేసే సదుపాయమూ ఉంది. ఇదింకా పూర్తిస్థాయిలో తయారుకాలేదు.  అయితే.. దీనికి సంబంధించిన వివరాలను తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సదరు సంస్థ పోస్ట్‌ చేయగానే.. చాలా మంది బాగుంది.. ఎంత రేటు అని ఎంక్వయిరీలు మొదలుపెట్టేశారు.

దీంతో ఇది మార్కెట్లోకి రాగానే సూపర్‌హిట్‌ కావడం తథ్యమని మా కార్పొరేషన్‌ నమ్మకంగా ఉంది. ఈ బ్యాగును పెంపుడు చేపలను వాకింగ్‌కే కాదు.. మార్కెట్‌ నుంచి బతికున్న చేపలను  వంట కోసం తేవడానికి కూడా ఉపయోగించుకోవచ్చట. అంటే.. ఒకేదాన్ని ఇటు వాకింగ్‌కు.. అటు కుకింగ్‌కు అన్నమాట.  

తెలంగాణలో అరుదైన చేప 
మంథని: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరిలోకి సముద్రపు చేపలు ఎదురెక్కుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలోని పోచమ్మవాడకు చెందిన కొత్త వేణు తన పొలానికి ఎస్సారెస్పీ నీటిని మళ్లిస్తుండగా కాలువలో అరుదైన చేప ప్రత్యక్షమైంది. శరీరమంతా ముళ్లతో భయానకంగా ఉన్న ఆ చేపను ఒడ్డుకు చేర్చిన రైతు.. దానిని స్థానికులకు చూపించాడు. సముద్రంలో మాత్రమే ఉండే ‘సీకుమొట్ట’గా స్థానికులు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు