నిశ్చితార్థం జరిగింది: బఖ్తావర్‌ భావోద్వేగం!

28 Nov, 2020 12:06 IST|Sakshi

బిలావల్‌కు కరోనా పాజిటివ్‌.. వీడియోకాల్‌లో సోదరికి విషెస్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీ- దివంగత ప్రధాని బేనజీర్‌ భుట్టోల కుమార్తె బఖ్తావర్‌ భుట్టో జర్దారీ త్వరలోనే వివాహ బంధంలో బంధంలో అడుగుపెట్టనున్నారు. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కుమారుడు మహ్మద్‌ చౌదరిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. కరాచిలోని బిలావల్‌ హౌజ్‌లో వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. సుమారు 100- 150 మంది అతిథులు ఈ శుభకార్యంలో పాల్గొని కాబోయే వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. 

అందరికీ ధన్యవాదాలు: బఖ్తావర్‌
భుట్టో- జర్దారీ కుటుంబ సన్నిహితులతో పాటు పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) నేతలు, ఇతర రాజకీయ నాయకులు, బిజినెస్‌ టైకూన్లు, న్యాయవాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బఖ్తావర్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ఇది సెంటిమెంటల్‌, ఎమోషనల్‌ డే. మాపై ప్రేమను కురిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీపీపీ కుటుంబానికి థాంక్స్‌. ఇది ఆరంభం మాత్రమే. ఆ దేవుడి దయతో భవిష్యత్‌ వేడుకలు ఘనంగా చేసుకుందాం’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. (చదవండి: త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రధాని!)

వీడియోకాల్‌లో విష్‌ చేసిన బిలావల్‌
బఖ్తావర్‌ సోదరుడు, రాజకీయ నాయకుడు బిలావల్‌ భుట్టోకు గతవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో వీడియో కాల్‌లో సోదరిని విష్‌ చేయగా.. అనారోగ్య కారణాలతో గత నెలలో ఆస్పత్రిపాలైన అసిఫ్‌ అలీ జర్దారీ ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో బిలావల్‌ హౌజ్‌కు చేరుకున్న ఆయన కూతురి నిశ్చితార్థ తంతును దగ్గరుండి జరిపించారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు