విషాదం: పెళ్లి బృందంపై పిడుగు పడి 16 మంది మృతి

5 Aug, 2021 12:43 IST|Sakshi

ఢాకా: నవవధువు, వరుడిని ఆశీర్వదించాలని వెళ్లిన అతిథులను మృత్యువు పిడుగు రూపంలో వెంటాడింది. సంతోషంతో సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో క్షతగాత్రులను కాపోడుకోవడానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ విషాదం ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. చపైనవాబ్‌గంజ్ జిల్లాలో ఓ వివాహానికి వచ్చిన బృందం పడవ దిగి నదీ సమీపంలోని షిబ్‌గంజ్‌ నగరంలో తమ విడిది ప్రాంతానికి వెళ్తున్నారు.

అంతలో హఠాత్తుగా రుతుపవనాల కారణంగా భారీ వర్షంతో పాటు పిడుగులు పడటం మొదలైంది. దీంతో పడవలో నుంచి ఒక్కొక్కరు దిగివస్తుండగా ఆ పెళ్లి బృందంపై సెకన్ల వ్యవధిలోనే పిడుగు పడింది. ఈ ప్రమాదంలో 16 మంది సభ్యులు మృతి చెందగా, పలువరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వరుడికి తీవ్రగాయాలు కాగా వధువు ప్రమాద జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో లేకపోవడంతో క్షేమంగా బయటపడింది. అందులో గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే  బంగ్లాదేశ్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య జిల్లా కాక్స్ బజార్‌లో ఆరుగురు రోహింగ్యా శరణార్థులతో సహా 20 మంది మృతి చెందారు.

మరిన్ని వార్తలు