Bangladesh Foreign Minister:తక్షణమే చర్యలు తీసుకుంటాం!

2 Oct, 2021 17:23 IST|Sakshi

మా స్వదేశమైన మయాన్మార్‌కి వెళ్లాలన్నదే నా కోరిక. నేను చనిపోయిన పర్వాలేదు నేను నా ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.

బంగ్లాదేశ్‌: రోహింగ్యాల శరణార్థుల నాయకుడు మోహిబ్‌ ఉల్లాను హత్య చేసిన వారిపై  సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్‌ మోమెన్‌ హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ అఘాయత్యానికి పాల్పడిన వారు తప్పించుకోలేరని వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మోహిబ్‌ ఉల్లాను కాక్స్‌ బజార్‌లో  కొంత మంది ముష్కరులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

(చదవండి: తల్లి చికిత్స కోసం కన్యత్వాన్ని అమ‍్మకానికి పెట్టిన బాలిక.. చివర్లో)

2017లో సైనిక దాడి కారణంగా ఏడు లక్షల మంది రోహింగ్యాలు మయాన్మార్‌ నుంచి పారిపోయి బంగ్లాదేశ్‌ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.  అయితే మోహిబ్‌ ఉల్లా ఈ శరణార్థుల కోసం అర అరకాన్‌ రోహింగ్యా శరణార్థుల సోసైటిని ఏర్పాటు చేసి వారి హక్కులు, శాంతియుత జీవనం కోసం పోరాడుతున్న రోహింగ్యాల నాయకుడు . అంతేకాదు రోహింగ్యాల స్వదేశమైన మయాన్మార్‌లో వారిపై జరుగుతున్న దాడుల గురించి అంతర్జాతీయంగా వారి గళం వినిపించేలా ఒక డాక్యుమెంట్‌ కూడా ప్రిపేర్‌ చేశాడు.

ఈ మేరకు రోహింగ్యాలు తమ స్వదేశానికి తిరిగే వెళ్లి జీవించే హక్కు ఉందని తాము కచ్చితంగా తమ స్వదేశానికీ తిరిగి వెళ్లాలన్నదే తన ఆశ అని కూడా వివరించాడు. ఈ క్రమంలోనే  కొంతమంది దుండగులు తమ స్వార్థ ప్రయోజనాల దృష్ట్య అతనిని హత్య చేసి ఉండవచ్చని విదేశాంగ మంత్రి మోమెన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పైగా మోహిబ్‌ ఉల్లా 2019లో తనకు చాలా బెదిరింపు కాల్స్‌ వచ్చాయని  'ఒక వేళ తాను మరణించిన బాగానే ఉంటాను, ప్రస్తుతం మాత్రం నేను నా ప్రాణన్ని ఇస్తాను' అంటూ అతను చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.

(చదవండి: వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు)

మరిన్ని వార్తలు