ట్రెండ్‌ సెట్టర్‌గా భారత ప్రధాని మోదీ.. మీ సాయానికి థ్యాంక్స్‌ అంటూ..

9 Mar, 2022 14:41 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. 14 రోజులుగా రష్యన్‌ బలగాలు ఉక్రెయిన్‌పై మిస్సైల్స్‌, బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. బాంబు దాడుల నేపథ్యంలో విదేశాలకు చెందిన విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాంబు దాడుల్లో విదేశీ విద్యార్థులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. 

అయితే, భారత విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ గంగాను చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే వేల సంఖ్యలో భారత విద్యార్థులను, పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా స‍్వదేశానికి తరలించింది. మరోవైపు ఆపరేషన్‌ గంగాలో భాగంగా కేవలం భారతీయులే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌ చేరుకుని ఇక్కడి నుంచి తమ స్వదేశాలను వెళ్తున్నారు. కాగా, తొమ్మిది మంది బంగ్లాదేశ్‌ ప్రజలు.. ఆపరేషన్‌ గంగాతో ఇండియా నుంచి తమ దేశానికి చేరుకున్నారు. 

ఈ సందర్భంగా బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. తమ దేశ పౌరులను యుద్ద ప్రభావిత ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా తరలించినందుకు మోదీకి ఆమె థ్యాంక్స్‌.. అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. పాకిస్తాన్‌కు చెందిన ఆస్మా షఫీక్.. భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయాలనికి, ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెప్పింది. ఉక్రెయిన్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, నరేంద్రమోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

ఇది చదవండి: పుతిన్‌ను ఆపకపోతే ప్రపంచం మొత్తం పెనువిధ్వంసమే: ఉక్రెయిన్‌ అధ్యక్షుడి భార్య జెలెన్‌స్కా

>
మరిన్ని వార్తలు