క్రికెటర్ వెడ్డింగ్ ఫోటోషూట్ : నెటిజన్లు ఫిదా

22 Oct, 2020 10:12 IST|Sakshi

ఢాకా : ఇటీవలి కాలంలో ఒక ఫ్యాషన్ గా మారిపోయిన వెడ్డింగ్ ఫోటోషూట్ లు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. నిన్నగాక మొన్న కేరళ జంట ఈ విషయంలో కొత్త అలజడి సృష్టించింది. తాజాగా బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్ (24) ఫోటోషూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చీర కట్టుతో, ఒంటినిండా నగలతో గ్రౌండ్‌లో బ్యాటింగ్ చేస్తూ చేసిన వెడ్డింగ్ షూట్ విశేషంగా నిలిచింది. అంతేకాదు ఈ  ఫోటోలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టిని కూడా ఆకర్షించాయి. ఆభరణాలు, క్రికెటర్ బ్యాట్. క్రికెటర్లకు వివాహ ఫోటోషూట్‌లు ఇలా ఉంటాయి అంటూ ఐసీసీ ఈ ఫోటోలను రీట్వీట్ చేయడం మరో  విశేషం. 

సంజిదా ఇస్లాం, ఇటీవల(అక్టోబర్ 17న) రంగాపూర్‌కు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిమ్ మొసాద్‌డీక్‌ను పెళ్లాడారు. ఈ సందర్బంగా క్రికెట్  పై పిచ్చి ప్రేమతో ఆ క్రికెట్‌ థీమ్‌తోనే  వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. పెళ్లికూతురు ముస్తాబులోనే బ్యాట్ పట్టి కవర్ డ్రైవ్, పుల్ షాట్స్  ఫోజులతో అదరగొట్టారు. దీంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ఫోటోలపై లక్షలాదిమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే  చాలామంది పాజిటివ్ గా స్పందించినట్టే.. ఎప్పటిలాగానే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అయితే వీటన్నింటినీ సంజిదా లైట్ తీసుకున్నారు. కాగా బంగ్లాదేశ్ అంతర్జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ఎనిమిదేళ్లుగా  ప్రాతినిధ్యం వహిస్తున్న సంజిదా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ విమెన్ గా  రాణిస్తున్నారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు