జైలును ఆర్ట్‌ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!

7 Dec, 2021 14:35 IST|Sakshi

జైలును కళలకు కేంద్రంగా మార్చడం ఏమిటి? అని సందేహంగా చూడకండి. నిజానికి ఇది చాలా ప్రసిద్ధిగాంచిన జైలు. ఈ జైలులోంచి ఎందరో గొప్ప గొప్ప కవులు పుట్టుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఆ జైలు అధికారులు ఆ జైలుని వేలం వేయాలని చూస్తున్నారు. అయితే ఒక వీధి కళాకారుడు తన కళలతో  వేలం ద్వారా వచ్చేంత డబ్బను ఇస్తానంటూ ఆ జైలుని భవనాలు అభివృద్ధి చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చేయాలని తపిస్తున్నాడు.

(చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ)
అసలు విషయంలోకెళ్లితే... ఇంగ్లాండ్‌కి చెందిన అజ్ఞాత వీధి కళాకారుడు బ్యాంక్సీ  జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడానికి మిలియన్లు సేకరిస్తున్నాడు. అయితే ఈ జైలు రీడింగ్ జైలుగాప్రసిద్ధి చెందింది. అంతేకాదు  ప్రసిద్ధ ఐరిష్ కవి నాటక రచయిత అయిన ఆస్కార్ వైల్డ్‌ను కలిగి ఉంది. అంతేకాదు జైలు అంటే ఒక నరకకూపంగా భావిస్తాం. అలాంటి ప్రదేశాన్ని కళకు కేంద్రంగా మార్చి పరిపూర్ణమైనదిగా చేయాలని తపిస్తున్నట్లు చెబుతాడు. ఈ మేరకు బ్యాక్సీ  "క్రియేట్ ఎస్కేప్" పేరుతో గోడ చిత్రాలను వేస్తాడు. దీంతో అక్కడ ఉన్న ప్రజల ఆ జైలు గోడల పై వేసిన చిత్రాల పట్ల ఆకర్షితులవుతారు. అంతేకాదు ఈ చిత్రాలను విక్రయించిన సోమ్ము జైలు అధికారులు వేలంలో ఆర్జించాలనకున్న దాదాపు రూ 100 కోట్లుకి సరిపోతుందని హామీ కూడా ఇస్తాడు.

అయితే ఈ చిత్రం ఈ నెల ప్రారంభంలో బ్రిస్టల్ మ్యూజియం మరియు ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించబడుతుందని, పైగా రూ 130 లక్షల వరకు సేకరించిగలనని ధీమా వ్యక్తం చేస్తాడు. ఈ మేరకు బ్యాంక్సీ ఈ జైలుని ఆర్ట్‌ సెంటర్‌గా మార్చేలా ప్రచారం కూడా చేస్తాడు. జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చాలనే ప్రచారానికి ఇప్పటికే నటులు డేమ్ జూడి డెంచ్, సర్ కెన్నెత్ బ్రనాగ్, కేట్ విన్స్‌లెట్, నటాలీ డోర్మెర్ నుండి మద్దతు లభించింది. అంతేకాదు బ్యాంక్సీ దీనికి సంబంధించిన ఒక వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!)

A post shared by Banksy (@banksy)

మరిన్ని వార్తలు