బైడెన్‌ కోసం బరాక్‌ ప్రచారం

18 Oct, 2020 04:16 IST|Sakshi

మకాన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా వచ్చేవారం డెమొక్రాట్‌ అభ్యర్థి జోబైడెన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. పెన్సిల్వేనియా, ఫిలిడెల్ఫియాల్లో ఈనెల 21న బైడెన్, కమలా హారిస్‌ తరఫున ఒబామా ప్రచారం సాగిస్తారని బైడెన్‌ ప్రచార బృందం ప్రకటించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రెండు మార్లు బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఒబామా నేరుగా ప్రచారానికి రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ర్యాలీల్లో ప్రజలను పెద్దపెట్టున ఆకర్షించే సత్తా డెమొక్రాట్లలో ఒబామాకే ఉందని పరిశీలకుల అంచనా. తన కారణంగా బైడెన్‌కు బ్లాక్‌ అమెరికన్లు, తటస్థుల మద్దతు పెరగవచ్చని భావిస్తున్నారు. అమెరికన్లు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని ఒబామా ఇటీవల పిలుపునిచ్చారు. కరోనాపై ట్రంప్‌ నిర్లక్ష్యాన్ని ఒబామా గతంలో నిశితంగా విమర్శించారు. 

మరిన్ని వార్తలు