ఛీ నా ఇల్లంతా పాడుచేసి....మొత్తం తినేసింది

2 Nov, 2021 20:00 IST|Sakshi

యూఎస్‌:మన ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు చోరబడి పాలు, బ్రెడ్‌ వంటి తినుబండరాలను తినేసి చిందరవందరంగా పడేయటం మన చూసి ఉంటాం. కానీ ఇక్కడ ఒక ఎలుగ బండి కేఎఫ్‌సీ చికెన్‌ తినేందుకు మాటు వేసి మరి అర్థరాత్రి వచ్చి తింటుంది. అసలు విషయంలోకి వెళ్లితే....కాలిఫోర్నియాలోని సియెర్రా మాడ్రే పట్టణానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంట్లో నిద్రపోతుండగా వింత వింత శబ్దాలు వస్తుంటాయి.

(చదవండి: అతనే గనుక ఆ సమయంలో అక్కడ లేకపోతే !)

దీంతో ఆ వ్యక్తి వెంటనే తలుపు తెరిచి హాల్లోకి వచ్చి చూడగా వంటగది వైపు నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నట్లు గుర్తిస్తాడు. అంతే మెల్లిగా భయపడుతూ వచ్చి చూస్తాడు. అక్కడ ఒక గోధమ రంగులో ఉన్న ఒక ఎలుగుబంటి కెఎఫ్‌సి చికెన్‌ని పరపర తింటుంది. అంతేకాదు వంటగది మొత్తం చిందరవందర చేస్తుంది. కానీ అది ఒక్కటే కాదని ఇంటి బయట ఇంకో ఎలుగుబంటి కూడా ఉందని  ఆ తర్వాత గ్రహిస్తాడు. ఈ మేరకు ఆ వ్యక్తి ఆ ఎలుగుబంటిని ఏదోరకంగా బయటికి పంపించేస్తాడు. ఏదిఏమైన ఎటువంటి జంతువులు జోరబడకుండా మన ఇళ్లను జాగ్రత్తగా పరివేక్షించుకోవల్సిందే తప్పదు.

(చదవండి: కాప్‌ 26 సదస్సులో జోబైడెన్‌ కునికిపాట్లు)

మరిన్ని వార్తలు