పోలీస్‌ స్టేషన్‌కు అనుకోని అతిథి

4 Oct, 2020 10:27 IST|Sakshi

పెన్సిల్వేనియా: ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తారు. కానీ ఎలుగుబంటి సైతం తన సమస్యను చెప్పుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? విషయం ఏమిటంటే... పెన్సిల్వేనియాలోని 'కార్బన్‌ కౌంటీ' ప్రాంతంలో చెత్తను తరలించే వాహనంపై ఎలుగుబంటి ఎక్కి పోలీస్ ‌స్టేషన్‌ వరకు వెళ్లింది.  వాహనంపై ఉన్న ఎలుగుబంటి ఫోటోను 'కిడ్డర్‌ టౌన్‌షిప్‌' పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే 1400 మంది షేర్‌ చేయడంతో ఆ చిత్రం ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. కార్బన్‌ కౌంటీ ప్రాంతంలో ఎలుగుబంట్ల సమస్యపై తరుచుగా ఫిర్యాదులు వచ్చేవని అక్కడి పోలీసు అధికారి అన్నారు. కానీ ఇప్పుడు వాటిని పట్టుకునేందుకు కష్టపడాల్సిన అవసరం లేకుండా ఎలుగుబంటే పోలీస్‌ స్టేషన్‌కు వచ్చింది. కాసేపటికే ఎలుగుబంటి సురక్షితంగా అడవుల్లోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా