ఇల్లు కావాలా నాయనా: కేవ‌లం రూ.86 మాత్ర‌మే

28 Oct, 2020 20:34 IST|Sakshi
త‌క్కువ ధ‌ర‌లో ఇళ్లు ల‌భించే ప్రాంతం(ఫొటో సేక‌ర‌ణ‌‌: వికీమీడియాస్ కామన్స్‌)

రోమ్: ఇల్లు క‌ట్టి చూడు - పెళ్లి చేసి చూడు అనే సామెత ఊరికే రాలేదు. ఈ రెండు కార్యాల‌లో దేన్ని మొద‌లు పెట్టినా ఊహించిన దానిక‌న్నా భారీ ఖ‌ర్చు  జ‌రిగి నెత్తిన అప్పుల‌ భారం ప‌డ‌టం ఖాయం. నేటి కాలంలో ఇల్లు లేనిదే ఇల్లాలు కూడా క‌న్నెత్తి చూడ‌ని ప‌రిస్థితి. దీంతో చాలామంది సొంతింటి కోసం క‌ల‌లు కంటూ ఆ ప‌గ‌టి క‌ల‌ల్లోనే స‌గం జీవితం బ‌తికేస్తారు. అలాంటి వారికి బంప‌రాఫ‌ర్‌.‌.. కేవ‌లం 86 రూపాయ‌ల‌కే ఇల్లు సొంతం చేసుకునే సువ‌ర్ణావ‌కాశం. హుర్రే, ఎక్క‌డ అని తెగ సంబ‌ర‌ప‌డిపోకండి. ఎందుకంటే ఇది మ‌న‌ద‌గ్గ‌ర కాదు! ఇట‌లీలోని స‌లేమీలో సిసిలో ప‌ట్ట‌ణంలో ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. ఒక్క యూరోకే ఇల్లు తీసుకోండి అంటూ జ‌నాల‌ను ఆక‌ర్షించే ప‌నిలో ప‌డ్డారు అక్క‌డి పాల‌కులు.  (చ‌ద‌వండి: నీ ఆఫర్‌ తగలెయ్య, మీరు మారరా!)

గృహాల‌ను మ‌రీ ఇంత చౌక‌గా ఎందుకు ఇస్తున్నారంటే.. 1968లో సిసిలీలో భూకంపం వ‌చ్చి అక్క‌డి ప్రాంతాన్ని, జ‌న‌జీవ‌నాన్ని అస్త‌వ్య‌స్తం చేసింది. అప్ప‌టి నుంచి అక్క‌డి ప్ర‌జ‌లు బ‌తుకుదెరువు కోసం న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్తూనే ఉన్నారు. దీంతో అక్క‌డ నివ‌సించేవారి జ‌నాభా పూర్తిగా త‌గ్గిపోయింది. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే రానున్న రోజుల్లో ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారి దెయ్యాల కొంప‌గా మారుతుందేమో అని పాల‌కుల‌కు భ‌యం ప‌ట్టుకుంది. అందుక‌ని "ఒక్క యూరోకే ఇల్లు" ప‌థ‌కం ప్ర‌క‌టించారు. ఒక్క యూరో అంటే భార‌త క‌రెన్సీలో 86 రూపాయ‌లు. క‌నీసం ఈ ఆఫ‌ర్ ద్వారానైనా జ‌నాల‌ను ఆక‌ర్షించి ఆ ప్రాంతాన్ని తిరిగి క‌ళ‌క‌ళ‌లాడేలా చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్ప‌టికే స‌లేమీలో నివాస‌యోగ్య‌మైన‌ పాత‌ ఇళ్ల‌ను గుర్తించి వేలానికి సిద్ధంగా ఉంచారు. అయితే అక్క‌డ ఇల్లు కొనాలంటే ఓ కండీష‌న్.. ఇళ్ల‌ను కొనుగోలు చేసేవారు వాటికి త‌ప్ప‌కుండా రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. (చ‌ద‌వండి: లవర్‌ను ఇలా కూడా నిద్రలేపుతారా?)

మరిన్ని వార్తలు