కరోనాను గుర్తించే పనిలో తేనెటీగలు 

8 May, 2021 21:15 IST|Sakshi

నెదర్లాండ్స్‌లో శిక్షణనిస్తున్న  పరిశోధకులు

తేనెటీగల ద్వారా కరోనాను గుర్తించడం తేలిక,  చౌక అంటున్న రీసెర్చర్లు

సాక్షి,న్యూఢిల్లీ: కోవిడ్‌-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పెను సంక్షోభాన్ని సృష్టించింది. కరోనా అంతానికి గ్లోబల్‌గా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికి కచ్చితమైన పరిష్కారం లభించలేదు. ముఖ్యంగా వైరస్‌ను గుర్తించేందుకే ఎక్కువ సమయం పడుతోంది. దీంతో తొందరగా కరోనాను గుర్తించే పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నెదర్లాండ్స్ పరిశోధకులు వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఈ వైరస్‌ ఇన్ఫెక్షన్ లక్షణాలను పసిగట్టేలా తేనెటీగలకు శిక్షణనిస్తున్నారు. తేనెటీగలకు వాసన పసిగట్టే అసాధారణ గుణం ఉందని, అదే తమ రీసెర్చ్‌కు దోహదపడుతుందని చెబుతున్నారు. కరోనా నిర్దారణ పరీక్షలకు గంటలు లేదా రోజులు పట్టవచ్చు, కాని తేనెటీగల నుండి ప్రతిస్పందన వెంటనే ఉంటుంది. ఈ పద్ధతి  చౌకగా కూడా ఉంటుంది. కోవిడ్ టెస్ట్ ఫలితాలకోసం వేచి ఉండే సమయం తగ్గనుందని భావిస్తున్నారు. అంతేకాదు పరీక్షలు కొరత ఉన్న దేశాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. (కరోనా విలయం: డీఆర్‌డీవో డ్రగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌)

నెదర్లాండ్స్ యూనివర్సిటీలో బయో వెటర్నరీ ల్యాబ్‌లో తెనేటీగల సామర్ధ్యంపై పరిశోధనలు చేస్తున్నారు. మొదట కోవిడ్ ఇన్ఫెక్షన్ శాంపిళ్లను వాసన వీటికి చూపుతారు. పువ్వుల్లో మకరందాన్నే ఆఘ్రాణించే రీతిలోనే ఇవి  స్ట్రా లాంటి నాలుకలతో వాటి వాసన పీల్చుతాయని  ఈ ప్రాజెక్టులో పాల్గొన్న వైరాలజీ ప్రొఫెసర్ విమ్ వాన్ డెర్ పోయెల్ చెప్పారు. ఆ తరువాత ‘రివార్డు’గా చక్కర కలిపిన నీటిని వీటికి ఇస్తామన్నారు. అయితే ఇన్ఫెక్షన్ సోకని శాంపిల్ ని చూపితే వీటికి ఈ రివార్డు ఉండదని తెలిపారు. కోవిడ్ నమూనాలను చూపినప్పుడు మాత్రం దీన్ని స్వీకరించేందుకు ఇష్టపడట. చక్కెర నీటిని తీసుకున్న తేనెటీగలు, ఈ నమూనాల శాంపిళ్లను అందించినపుడు నాలుకలను చాచవని  చెప్పారు. తేనెటీగలను సేకరించేవారి నుంచి తాము వీటిని తీసుకువచ్చి ప్రత్యేక హార్నెసెస్ వంటి వాటిలో ఉంచుతామన్నారు. ఇలా వీటి వల్ల కోవిడ్ ఫలితాలను త్వరగా గుర్తించవచ్చునన్నారు. వీటి రెస్పాన్స్ తక్షణమే ఉంటుందన్నారు. ఇది చౌక అయిన పధ్దతి అని, టెస్టులు తక్కువగా జరిగే దేశాల్లో ఇది ప్రయోగాజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. (కళ్లు తెరవండి! లేదంటే 10 లక్షల మరణాలు: లాన్సెట్‌ హెచ‍్చరిక)

అయితే  దీనివల్ల పెద్దగా ఫలితం ఉండదని ఘెంట్ విశ్వవిద్యాలయంలో తేనెటీగలు, కీటకాలు,  జంతు రోగనిరోధక శాస్త్రాన్ని అధ్యయనం చేసే ప్రొఫెసర్ డిర్క్ డీ గ్రాఫ్ తెలిపారు. సమీప భవిష్యత్తులో ఇలాంటివి పనికి రావని, కరోనా నిర్దారణ పరీక్షల కంటే కూడా ఇతర పనులకోసం వాటిని వినియోగించుకుంటానని వెల్లడించారు. క్లాసిక్ డయాగ్నస్టిక్ పరికరాలనే కోవిడ్‌ టెస్టులకు వినియోగించుకోవడం మంచిదన్నారు. 1990 ప్రాంతాల్లో అమెరికాలోని రక్షణ విభాగం ‘‘ఇన్‌సెక్ట్‌ స్నిఫింగ్" అనే సాంకేతికతను వాడిందని, పేలుడు పదార్థాలను, విషపదార్థాలను గుర్తించడానికి తేనెటీగలు, కందిరీగలను వినియోగించుకుందని  ఆయన పేర్కొన్నారు. (కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!)

మరిన్ని వార్తలు