శాంటా క్లాజ్‌ గిప్ట్స్‌ : ఊహించని విషాదం

28 Dec, 2020 16:45 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

శాంటాకు కరోనా, 18మంది కన్నుమూత

157 మందికి అస్వస్థత

క్రిస్మస్‌ శాంటా క్లాజ్ నుంచి కానుకలు అందుకున్న వారి జీవితాల్లో భారీ విషాదం అలుముకుంది. ఉత్సాహంగా బహుమతులందుకున్న వారిలో 18 మంది కరోనాకు బలయ్యారు.  ముఖ్యంగా బహుమతులను పంచిన శాంటాకి అప్పటికే కరోనా సోకింది. కానీ ఈ  విషయాన్ని గమనించని శాంటా వృద్ధాశ్ర‌మంలో  గిఫ్ట్‌లను అందించారు. ఈ అజాగ్రత్తే బెల్జియంలోని ఒక హెమ్‌పాలిట పీడకలగా మారి పోయింది.

యాంట్‌వెర్ప్ అనే వృద్ధాశ్ర‌మం వారు అక్క‌డి వృద్ధులకు క్రిస్మ‌స్  సంబరాల్లో భాగంగా శాంటాను పిలిచారు. దీనికోసం అక్క‌డి వృద్ధాశ్ర‌మంలో వారి ఆరోగ్య సంర‌క్ష‌ణ చూసుకునే డాక్ట‌ర్‌నే శాంటా క్లాజ్‌గా వ్యవరించారు.  అయితే అత‌నికి అప్ప‌టికే క‌రోనా సోకడంతో అత‌ని నుంచి బ‌హుమతులు అందుకున్న అంద‌రికీ వైర‌స్ వ్యాప్తి చెందింది.  ఈ 'సూపర్ స్ప్రెడర్'  కారణంగా కేర్ హోమ్‌లోని 121 మందితోపాటు అక్క‌డి 36 మంది సిబ్బందికి  కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది.  వీరిలో18 మంది  ప్రాణాలు కోల్పోవడం మరింత  విషాదాన్ని  నింపింది. మరోవైపు శాంటా వ‌చ్చిన‌ప్పుడే అత‌ని ఆరోగ్యం బాగాలేద‌ని, అయితే త‌న‌కు క‌రోనా సోకిన విష‌యం డాక్టర్‌కు, తమకూ తెలియ‌ద‌ని వృద్ధాశ్ర‌మ నిర్వాహ‌కులు వాపోతున్నారు. అయితే వృద్ధుల‌కు బ‌హుమ‌తులు ఇచ్చే స‌మ‌యంలో కరోనా సంబంధిత నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేద‌ని న‌గ‌ర మేయ‌ర్ విమ్ కేయ‌ర్స్ చెబుతున్నారు. మిగిలిన బాధితులు కోలుకుంటున్నారనీ, కానీ  రానున్న 10 రోజులు మరింత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు