బెర్లిన్‌: ఆమె పోరాడింది.. టాప్‌లెస్‌ సమానత్వం సాధించింది

11 Mar, 2023 12:09 IST|Sakshi

జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్‌ పూల్స్‌లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్‌లెస్‌గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. 

తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద టాప్‌లెస్‌గా సన్‌బాత్‌ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..  ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్‌ ఆంబుడ్స్‌పర్సన్‌ ఆఫీస్‌ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్‌లెస్‌గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్‌కు అధికారులు దిగొచ్చారు. 

వివక్షకు పుల్‌స్టాప్‌ పెడుతున్నట్లు బెర్లిన్‌ అధికారులు ప్రకటించారు. బెర్లిన్‌లో స్మిమ్మింగ్‌ పూల్స్‌ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్‌బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు.

జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు.

మరిన్ని వార్తలు