Bermuda Triangle: మాయమైతే.. పైసలు వాపస్‌

29 May, 2022 05:48 IST|Sakshi

యూకే కంపెనీ బెర్ముడా చాలెంజ్‌

న్యూయార్క్‌: బెర్ముడా ట్రయాంగిల్‌ మిస్టరీని వ్యాపారంగా మార్చుకునేందుకు యూకేకు చెందిన ‘యాన్సియంట్‌ మిస్టరీస్‌’అనే సంస్థ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. ‘బెర్ముడా ట్రయాంగిల్‌ ప్రాంతంలోకి వెళ్లాక మాయమవుతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనిపించకుండా పోతే మీ డబ్బు 100% వాపస్‌ ఇస్తాం’అనిప్రకటించింది.

వచ్చే ఏడాది మార్చిలో నార్వేజియన్‌ ప్రిమా షిప్‌ న్యూయార్క్‌ నుంచి బెర్ముడాకు ప్రయాణం ప్రారంభించనుంది. ఆ ఓడ అడుగు భాగమంతా గ్లాస్‌తోనే తయారైందని చెప్పింది. క్యాబిన్‌ టికెట్‌ ఖర్చు ఒక్కరికి 1830 డాలర్లపైనే అని తెలిపింది. అట్లాంటిక్‌ సముద్రంలోని 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్‌  ప్రాంతంలోకి వెళ్లిన 75 విమానాలు వందల సంఖ్యలో ఓడలు కనిపించకుండా పోయాయి.

మరిన్ని వార్తలు