బైడెన్, పుతిన్‌ భేటీల భేటీ ఖరారు

26 May, 2021 02:18 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ జూన్‌ 16న జెనీవాలో భేటీ కానున్నారు. బైడెన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో అమెరికా, రష్యా మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీని వైట్‌హౌస్‌ మంగళవారం ధ్రువీకరించింది. అమెరికా–రష్యా సంబంధాలపై బైడెన్, పుతిన్‌ పూర్తి స్థాయిలో చర్చించుకొనే అవకాశం ఉందని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ చెప్పారు.   

మరిన్ని వార్తలు