జో బైడెన్‌ ఇంటి వద్ద విమాన కలకలం.. అటాక్‌ కాదు.. వైట్‌ హౌస్‌ క్లారిటీ

5 Jun, 2022 09:21 IST|Sakshi

అమెరికా అధ‍్యక్షుడు జో బైడెన్‌ నివాసం వద్ద ఓ విమానం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైట్‌ హౌస్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఒక చిన్న విమానం అమెరికా అధ్యక్షుడికి చెందిన రెహోబోత్ బీచ్ హోమ్ ప్రాంతం(వాషింగ్టన్‌కు 200 కి.మీ దూరం) గగనతలంలోకి ప్రవేశించింది. నో-ఫ్లై జోన్‌లోకి విమానం రావడంతో ఒక్కసారిగా భద్రతా సిబ‍్బంది అలర్ట్‌ అయ్యారు. 

దీంతో, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌, ప్ర‌థ‌మ పౌరురాలు జిల్‌ బైడెన్‌ను సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించినట్టు తెలిపారు. అయితే, ప్రెసిడెంట్‌ను రక్షించే బాధ్యతను స్వీకరించిన సీక్రెట్ సర్వీస్ విమానం.. పొరపాటున సురక్షిత ప్రాంతంలోకి ప్రవేశించిందని చెప్పారు. సమాచారం అందించిన వెంటనే విమానం బయటకు వెళ్లినట్టు స్పష్టం చేశారు. కాగా, ప్రెసిడెంట్, ఆయ‌న కుటుంబానికి ఎలాంటి ముప్పులేదని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని సర్వీస్ ప్రతినిధి ఆంథోనీ గుగ్లియెల్మీ చెప్పారు.

మరిన్ని వార్తలు