అమెరికాలో ఆర్థిక మాంద్యం రాదు: బైడెన్‌

27 Jul, 2022 04:44 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందని భావించడం లేదని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ మరింత పడిపోతుందనే అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగిత గణాంకాలు ఆశాజనకంగా ఉన్నందున..ప్రస్తుత వేగం పుంజుకున్న అభివృద్ధి, స్థిరత్వాన్ని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు కూడా మాంద్యం భయాలను కొట్టిపారేస్తున్నారు. పటిష్టమైన లేబర్‌ మార్కెట్ల వల్ల అలాంటి పరిస్థితి రాదని అంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీలో 1.6%క్షీణత నమోదైంది. రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశముందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, స్వల్ప వృద్ధి నమోదవుతుందనే విషయంలో ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు