ఉత్తర కొరియాకు వ్యాక్సిన్‌ ఆఫర్‌ ప్రకటించిన అమెరికా...కిమ్‌ని కలుస్తానంటున్న బైడెన్‌

21 May, 2022 17:17 IST|Sakshi

US' Aid Offer To Covid-Stricken North Korea: కరోనా మహమ్మారితో  అల్లాడిపోతున్న ఉత్తర కొరియాలోని ప్యోంగ్యాంగ్‌తోపాటు చైనాకు వ్యాక్సిన్‌లు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. తాము త్వరితగతిన ఈ వ్యాక్సిన్‌లు అందించేందుకు రెడీగా ఉన్నాం అని కూడా తెలిపారు. ఐతే ఉత్తరకొరియా నుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. ఈ మేరకు బైడెన్‌ సియోల్‌లోని దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్‌ సుక్‌ యోల్‌తో  జరిగిన ఉమ్మడి సమావేశంలో ఈ వైరస్‌ని ఎదుర్కొవడంలో ఉత్తరకొరియాకి సాయం చేసేలా అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఇరువురు నాయకులు పేర్కొన్నారు.

అంతేకాదు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ నిజాయితీగా ఉంటే ఆయన్ని కలిసేందుకు సిద్ధం అని బైడెన్ చెప్పారు. అలాగే ఇరువురు నాయకులు తమతమ దేశాల్లో సైనిక విన్యాసాలను ముమ్మరం చేశామని ప్రకటించడంతో కిమ్‌కి ఆగ్రహం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు యూన్, బైడెన్ ఇద్దరూ పెట్టుబడులు పెట్టేందుక అంగీకరించడమే కాకుండాసెమీకండక్టర్, బ్యాటరీల వంటి పరిశ్రమల సరఫరా గొలుసులను స్థిరీకరించడానికి సహకరించడానికి ఒప్పందాలు చేసుకున్నారు.

బైడెన్‌ పర్యటన సందర్భంగా ఐక్యరాజ్యసమతి ఆంక్షలను దిక్కరిస్తూ ఉత్తర కొరియా కవ్వింపుచర్యలకు దిగుతుందంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఒక పక్క ఉత్తరకొరియాలోని ప్యోంగ్యాంగ్‌లో ఆహార కొరతతో బాధపడుతుంటే కిమ్‌ మాత్రం మిలటరీని ఆధునికరించే పనిలో ఉన్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

(చదవండి:  ఉక్రెయిన్‌కు ఎదురుదెబ్బ.. పుల్‌ హ్యాపీగా పుతిన్‌)

మరిన్ని వార్తలు