Biden Urged To Act Against India: భారత వ్యవసాయం రంగంపై కీలక వ్యాఖ్యలు...చర్యలు తీసుకోవాలని బైడెన్‌కి విజ్ఞప్తి

2 Jul, 2022 10:34 IST|Sakshi

Dangerous trade-distorting practices: అమెరికా కాంగ్రెస్‌ చట్టసభ సభ్యులు భారత్‌ వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ వ్యవసాయ రంగంలో సరైన నియమాలు లేవని ఇవి ప్రమాదకరమైన వాణిజ్యాన్ని వక్రీకరించే పద్ధతులు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై భారత్‌తో సంప్రదింపుల కోసం అధికారిక అభ్యర్థనను ధాఖాలు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ని కోరారు. ఈ మేరకు 12 మంది కాంగ్రెస్‌ సభ్యులు బైడెన్‌కి లేఖ రాశారు. "ఆ లేఖలో...ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నియమాల ప్రకారం ఆయా దేశాల ప్రభుత్వాలు వస్తువుల ఉత్పత్తి విలువలో 10% వరకు సబ్సిడీ ఇవ్వడానికి అనుమతిస్తాయి.

కానీ భారత ప్రభుత్వం బియ్యం, గోధుమలతో సహా అనేక వస్తువులకు ఉత్పత్తి విలువలో సగానికి పైగా సబ్సిడీని కొనసాగిస్తోంది. బైడెన్‌ పాలన నియమాలకు విరుద్ధంగా భారత్‌ ధరలను తగ్గించడం, బియ్యం, గోధుమ వంటి వాటి ఉత్పత్తిని తగ్గించడం వంటివి చేస్తోందని ఆరోపించారు. ఇది అమెరికా ఉత్పత్తిదారులకు ప్రతికూలంగా ఉండటమే కాకుండా ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిని, వాణిజ్యాన్ని కూడా పూర్తిగా మార్చేసిందన్నారు. భారత్‌ వ్యవసాయ రంగ విధానాలు ప్రపంచ స్థాయిలో ప్రమాదకరమైన వాణిజ్య వక్రీకరణ అని ఆరోపణలు చేశారు.

భారత్ అనుసరిస్తున్న విధానాలు అమెరికాలోని రైతులపై ప్రభావం చూపుతోంది." అని ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోని ఇతర సభ్యుల మద్దతు తీసుకుని భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపాలని కోరారు. ఏకాభిప్రాయం కోసం అమెరికా భారత్‌కి వంతపాడోద్దని, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆహార కొరతను దృష్టిలో ఉంచుకుని పరిష్కార దిశగా అమెరికా తగు చర్యలు తీసుకోవాలంటూ బైడెన్‌ని చట్ట సభ సభ్యులు డిమాండ్‌ చేశారు.

అంతేకాదు అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత కోసం స్థితిస్థాపక పరిస్థితులను నిర్మించడంలో అమెరికా వ్యవసాయం దోహదపడుతుందన్నారు. కానీ భారత్‌ మాత్రం డబ్ల్యూటీఓలో తాము అనుసరిస్తున్న విధానం సరైనదేనని నొక్కి చెబుతోంది. తమ రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో భాగంగా భారత్‌ ఇలాంటి విధానాలను అనుసరిస్తోందని , దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థలు ప్రశంసించాయని చెప్పడం విశేషం.

(చదవండి: రూ. 300 కోట్ల మోసానికి పాల్పడ్డ భారత సంతతి వ్యక్తి అరెస్ట్‌)

మరిన్ని వార్తలు