బైడెన్‌ ప్రమాణ స్వీకారం.. క్లింటన్‌ కునికిపాట్లు

21 Jan, 2021 15:02 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక బైడెన్‌తో పాటు అమెరికా 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు వారాల క్రితం ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేసిన క్యాపిటల్‌ భవనంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌.. బైడెన్‌తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. అధ్యక్షుడుగా బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా మన తమిళనాడు మూలాలున్న ఇండో–ఆఫ్రో అమెరికన్‌ మహిళ కమలా హారిస్‌(56) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.
(చదవండి: మళ్లీ వస్తా: డొనాల్డ్‌ ట్రంప్‌)

ఇక బైడెన్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతుండగా.. వీటిలో ఒకటి మాత్రం నవ్వులు పూయిస్తోంది. ఈ ఫోటో మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌కి సంబంధించినది. ఇక దీనిలో ఆయన కునికిపాట్లు పడుతున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. భార్య హిల్లరీ క్లింటన్‌తో కలిసి బైడెన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బిల్‌ క్లింటన్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ మైక్‌ పెన్స్‌, మాజీ  అధ్యక్షుడు జార్జి డబ్లూ​.బుష్‌ వెనక వరుసలో కూర్చోని ఉన్నారు. ఇక ఈ ఫోటోపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వృద్ధుడు అయ్యాడు కదా.. పాపం వదిలేయండి’’.. ‘‘జో బైడెన్‌ ప్రభుత్వం కల్పించిన నమ్మకం ఇది. ఇక మనం బహిరంగా కార్యక్రమాల్లో ప్రశాంతంగా నిద్ర పోవచ్చు.. నా దిండు పంపిస్తాను’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక డొనాల్డ్‌ ట్రంప్‌, బైడెన్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేదు.
(చదవండి: బైడెన్‌ టీం: మనకే అగ్ర తాంబులం)

ఇక కార్యక్రమంలో లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం 2017లో తొలి యువ కవయిత్రి పురస్కారాన్ని పొందిన అమండా గార్మన్‌.. తాను రాసిన ఒక కవితను చదివి వినిపించారు. ఆ తరువాత, నటి, గాయని జెన్నిఫర్‌ లోపెజ్‌ ఒక పాటను ఆలపించారు. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు