బిల్‌గేట్స్‌, బెజోస్‌పై విమర్శలు: ‘మాకు నీతులు చెప్పి.. మీరేమో ఇలా’

1 Nov, 2021 18:09 IST|Sakshi

విమర్శలకు వేదికగా మారిన బిల్‌ గేట్స్‌ బర్త్‌డే పార్టీ

4 గంటల వ్యవధిలో 19 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల

వాషింగ్టన్‌: సామాన్యులు అంటే పర్లేదు కానీ.. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమ నోటి వెంట వచ్చే మాటకు కట్టుబడి ఉండాలి. చేసేవాటినే చెప్పాలి.. చెప్పిన వాటిని ఆచరించాలి. అలా కాదని ప్రజలకు నీతి వ్యాఖ్యలు బోధించి.. వారు మాత్రం విచ్చలవిడిగా ప్రవర్తించడం కరెక్ట్‌ కాదు. జనాలు కూడా ఊరుకోరు. ఎడాపెడా చీవాట్లు పెడతారు. తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రపంచ కుబేరులు బిల్‌గేట్స్‌, జెఫ్‌ బెజోస్‌. వీరిద్దరిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు నెటిజనులు. ఈ కుబేరులు ఇంతలా విమర్శలపాలు కావడానికి కారణం ఏంటో తెలియాలంటే ఇది చదవండి. 

కొద్ది రోజుల క్రితమే బిల్‌గేట్స్‌ తన 66వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జరుపుకున్నారు. కేవలం 50 మంది మాత్రమే ఈ బర్త్‌డే పార్టీకి హాజరయ్యారు. వేడుకలు టర్కీ సముద్ర తీరంలో.. ఓ లగ్జరీ పడవలో నిర్వహించారు. ఈ పార్టీకి హాజరుకావడం కోసం బెజోస్‌ హెలికాప్టర్‌లో 120 మైళ్ల దూరం ప్రయాణించి.. అక్కడకు చేరుకున్నాడు.

ఈ బర్త్‌డే వేడుకల సందర్భంగా వెల్లడైన కార్బన్‌డైయాక్సైడ్‌ మోతాదుపై తాజాగా విపరీతమైన చర్చ నడుస్తోంది. కేవలం నాలుగు గంటల పాటు సాగిన బర్త్‌డే పార్టీ జరిగిన పడవ నుంచి 19 టన్నులు, బెజోస్‌ హెలికాప్టర్‌ ప్రయాణంలో 215 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్‌ వెల్లడయినట్లు తెలిసింది. 
(చదవండి: ఆయన గెలుపు కంటే.. ఈయన వెటకారమే ఎక్కువైంది)

ఈ క్రమంలో పలువురు నెటిజనులు బిల్‌గేట్స్‌, బెజోస్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. ఓ వైపు ఈ ఇద్దరు మానవతావాదులు పర్యావరణ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరోవైపు వీరి ఆడంబరాలు.. మరింత కార్బన్‌ ఉద్గారాలను వెల్లడిస్తుంటాయి. జనాలకేమో ఆఫీసుకు వెళ్లడానికి వ్యక్తిగత వాహనాల బదులు.. ప్రజా రవాణ వ్యవస్థను వినియోగించుకొండి అని నీతులు చెబుతూ.. మీరు మాత్రం మీకు నచ్చినట్లు ఎంజాయ్‌ చేయండి అని విమర్శిస్తున్నారు. 
(చదవండి: బిల్‌గేట్స్‌నే బకరా చేసిన బిల్డప్‌ బాబాయ్‌)

బిల్‌గేట్స్‌ బర్త్‌డే పార్టీ  జరిగిన పడవ సూపర్‌యాచ్‌ని లానా అని పిలుస్తారు. ప్రముఖ వ్యాపార దినపత్రిక ప్రకారం, గేట్స్ వారానికి 1.8 మిలియన్ పౌండ్‌లకు దీనిని అద్దెకు తీసుకున్నారు. గేట్స్ అతిథులు మెగా-యాచ్ నుంచి సీ మీ బీచ్ అని పిలువబడే ఫెతియే నగరంలోని ఏకాంత బీచ్‌కి వెళ్లినట్లు తెలిసింది.

చదవండి: ఇద్దరూ ఇద్దరే.. వీళ్ల చర్యలు ఊహాతీతం

మరిన్ని వార్తలు