బిల్‌గేట్స్‌కు షాక్‌ ఇవ్వడానికి సిద్ధమవుతున్న మెలిందా

31 May, 2021 17:20 IST|Sakshi

పిల్లలకు ఎక్కువ ఆస్తి ఇప్పించడానికి మెలిందా ప్రయత్నం

వాషింగ్టన్‌: మైక్రో సాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భార్య మెలిందా నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వారు వివరించలేదు.. కానీ 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత తాము సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగం తమ ఫౌండేషన్‌కే చెందుతుందని పిల్లలకు కేవలం 10 మిలియన్‌ డాలర్ల చొప్పున ఇస్తామని గేట్స్‌ బహిరంగంగానే ప్రకటించారు. 

అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని మెలిందా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. తన బిడ్డలకు వారసత్వంగా ఎక్కువ ఆస్తిని ఇప్పించాలని మెలిందా భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆమె  తమ ఇద్దరి సమిష్టి సంపద 130 బిలియన్‌ డాలర్ల ఆస్తిని విభజించడానికి సిద్ధమవుతున్నారట. ఇందుకు గాను మెలిందా ఒక న్యాయ బృందాన్ని నియమించుకుందని.. దీనిలో టాప్‌ ట్రస్ట్‌, ఎస్టెట్‌ లాయర్‌ ఉన్నారని డెయిలీ మెయిల్‌ కోట్‌ చేసింది. మెలిందా తాజా నిర్ణయంతో వారి కూతుళ్లు జెన్నిఫర్‌ కేథరీన్‌ (25), ఫేబీ అడేల్‌ (18), కొడుకు రోనీ జాన్‌ (21) వారసత్వంగా ఎక్కువ ఆస్తి లభించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

చదవండి: గేట్స్‌ దంపతులు విడిపోవడానికి కారణం ‘అతడేనట’..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు