గిరిజన బాలికలపై ప్రమాదకర క్లినికల్‌ ట్రయల్స్‌.. బిల్‌ గేట్స్‌ను అరెస్ట్‌ చేయాలి

30 Apr, 2021 15:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కోవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా నివారణ కోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫార్ములాను భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఆయనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముందెన్నడూ లేనిది ఇప్పడెందుకు
ప్రస్తుతం ప్రపంచం దేశాలు ఈ కరోనా మహమ్మారి కట్టడి కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ రూపంలో ఈ వైరస్‌ భారత్‌లో వీర విహారం చేస్తోంది. ఇంతటి గడ్డు కాలాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కుంటుండగా ఇటీవల బిల్ గేట్స్‌ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇటీవలు ఆయన ఓ ఇంటర్వ్యూలో.. కోవిడ్ వ్యాక్సిన్ల ఫార్ములాను ఇతర దేశాలతో పంచుకోవడానికి వీలుగా మేధో సంపత్తి హక్కుల చట్టాన్ని మార్చడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. అందుకు బిల్ గేట్స్ సమాధానమిస్తూ.. భారత్‌ సహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఫార్ములాను ఇవ్వడాన్ని ఆయన నిరాకరించారు.  దీనికి మరింత వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో చాలా వ్యాక్సిన్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.

అలాగే వ్యాక్సిన్ల భద్రత, రక్షణల గురించి ప్రజలు చాలానే ఆలోచిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్తగా ఫార్ములాను పంచుకోవడం ఏంటని అన్నారు. అంతేందుకు భారతదేశంలో అతిపెద్ద సంస్థ అయిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా (SII), ఆస్ట్రాజెనెకాతో ఓ ఒప్పందం ప్రకారం కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను తయారు చేస్తోందని తెలిపారు.  ప్రపంచ వ్యాక్సినేషన్ విషయంలో కొన్నిటిని నిలిపి ఉంచడానికి కారణం మేధో సంపత్తి హక్కులు కారణం కాదన్నారు. ఏదో వ్యాక్సిన్ ఫ్యాక్టరీ ఉంటుందని, దానికి రెగ్యులేటరీ అనుమతులు కూడా వస్తాయని చెప్పారు. దాంతో అది సురక్షితమైన వ్యాక్సిన్లను తయారు చేస్తుందని కాదని అన్నారు. వీటిపై పరీక్షలు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. ప్రతి తయారీ ప్రక్రియను చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంటుందని ఆయన తన సమాధానానికి వివరణ ఇచ్చారు.

( చదవండి: కోవాగ్జిన్‌తో డబుల్‌ మ్యూటెంట్‌కి అడ్డుకట్ట )

మరిన్ని వార్తలు