డీమర్స్‌ కోసం యూఎస్‌ కాంగ్రెస్‌లో బిల్లు

3 Jul, 2021 04:19 IST|Sakshi

వాషింగ్టన్‌: దేశంలో చాన్నాళ్లుగా నాన్‌ ఇమిగ్రంట్‌ వీసాపై ఉన్నవారితో పాటు డిపెండెంట్స్‌గా అమెరికా వచ్చిన పిల్లలకు(డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌) శాశ్వత నివాస సదుపాయం కల్పించే దిశగా ముందడుగు పడింది. డెమొక్రటిక్, రిపబ్లికన్‌ పార్టీల సభ్యులు సంబంధిత బిల్లును కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయంతో పలువురు భారతీయ పిల్లలు, యువతకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం నాన్‌ ఇమిగ్రంట్‌ వీసాదారుల పిల్లలు, 21 ఏళ్ల వయస్సు దాటితే, స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది.  అమెరికాలో ఈ డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌ సంఖ్య దాదాపు 2 లక్షలు ఉంటుంది. వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.  

మరిన్ని వార్తలు