5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్‌ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు

18 Dec, 2022 16:05 IST|Sakshi

ఇద్దరు కెనడియన్‌బిలినియర్‌ దంపతులు 5 ఏళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మొదట్లో ఆత్మహత్య చేసుకున్నారని భావించారు అంతా. ఆ తర్వాత హత్య అని తేలినా ఇప్పటికి వరకు ఈ కేసు మిస్టరీ అంతుచిక్కలేదు పోలీసులకు. దీంతో హంతకుడు తలపై భారీ మొత్తంలో నగదును సైతం ప్రకటించారు మృతుల కుటుంబ సభ్యులు.

వివరాల్లోకెళ్తే...డ్రగ్‌ దిగ్గజం అపోటెక్స్‌ వ్యవస్థాపకుడు బారీ షెర్మాన్‌ అతని భార్య హనీ ఐదేళ్ల క్రితం టోరంటోలోని వారి ఇంటిలో హత్యకు గురయ్యారు. ఆ బిలినియర్‌ దంపతులు డిసెంబర్‌ 15, 2017న మృతి చెందారు. ఐదేళ్లైన ఇప్పటికీ ఈ కేసులో కీలక నిందితులను పట్టుకోవడంలో విఫలమయ్యారు పోలీసులు. వాస్తవానికి భారీ షెర్మాన్‌ 1974లో అపోటెక్స్‌ అనే డ్రగ్‌ కంపెనీని స్థాపించాడు. ఆ తర్వాత దాన్ని ప్రధాన ఔషధ కంపెనీగా తీర్చిదిద్ది అంచెలంచెలుగా బిలినియర్‌ స్థాయికి ఎదిగాడు. ఆ జంట సుమారు రూ. 400 కోట్ల డబ్బును దాతృత్వ సేవలకు వినియోగించారు.

ఆ జంట చనిపోయేటప్పటికీ వారి నికర చరా ఆస్తుల విలువ సుమారు 20 వేల కోట్ల డాలర్లుగా ఫోర్బ్స్‌ అంచనా వేసింది. ఆ జంట అంత్యక్రియలకు ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మరియు అంటారియో ప్రావిన్స్ ప్రీమియర్ కాథ్లీన్ వైన్‌తో సహా వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. తమ తల్లిదండ్రుల హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తుందని వారి పిల్లలు కుమారుడు జోనాథన్ షెర్మాన్ , కుమార్తె అలెక్స్ క్రావ్జిక్ కన్నీటి పర్యంతమయ్యారు.

అలాగే ఈ హత్యకేసు సాధ్యమైనంత తొందరగా చేధించి నిందితుడుని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు కోరారు వారు. ఆ హంతకుడి ఆచూకి తెలిపిన వారికి దాదాపు రూ. 500 కోట్లు వరకు అందజేస్తామంటూ ఇది వరకు ప్రకటించిన ఆఫర్‌ని రెడ్డింతలు పెంచి మరీ ప్రకటించారు. పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి పలువురు కుటుంబసభ్యులను విచారించారు. ఐతే ఈ కేసులో కీలక నిందితులను ఆచూకి మాత్రం లభించలేకపోవడం గమనార్హం. 

(చదవండి:

మరిన్ని వార్తలు