ఆకాశంలో పుట్టినరోజు వేడుకలు.. చిన్నారికి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. వీడియో వైరల్‌

23 Jul, 2023 18:40 IST|Sakshi

పుట్టినరోజును ఎవరైన చాలా స్పెషల్‌గా జరుపుకోవాలనుకుంటారు. అందుకు ముందే కొత్తగా ప్లాన్ చేసుకుంటారు. అందులోనూ మొదటి బర్త్‌డే అంటే ఇక ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని రోజుల ముందే ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇవేం లేకుండానే ఓ చిన్నారి తన బర్త్‌డేని చాలా స్పెషల్‌గా జరుపుకుంది. ఎందుకంటే చిన్నారి పుట్టినరోజుని ఏకంగా ఇండిగో విమాన సంస్థే జరిపింది.

బ్యూలా లాల్ అనే చిన్నారికి ఇండిగో విమాన సంస్థ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇచ్చింది. జీవితాంతం గుర్తుండిపోయేలా అరుదైన జ్ఞాపకాన్ని అందించింది. చిన్నారి మొదటి పుట్టిన రోజునే విమానంలో ప్రయాణిస‍్తుందని తెలుసుకుని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ముందస్తుగా బర్త్‌డే ప్లాన్ చేశారు. కరాచీ విమానాశ్రయానికి చిన్నారి రాగానే ఎయిర్‌లైన్స్‌ కెప్టెన్ మైక్ అందుకుని ఈ విషయాన‍్ని మైకులో అందరికీ ప్రకటించారు. చిన్నారితో కేక్ కట్ చేయించారు. విమాన ప్రయాణీకులందరూ చిన్నారి పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. 

A post shared by JOEL LAL J (@joellalj)

ఈ వీడియోను చిన్నారి తండ్రి జోయెల్ లాల్‌ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చాలా మంచి అవకాశం అని స‍్పందించారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. లాంగ్ లైఫ్‌, హ్యాప్పీగా ఉండాలని చిన్నారి సోషల్ మీడియా వేదికగా దీవించారు.

A post shared by JOEL LAL J (@joellalj)

ఇదీ చదవండి: సినిమా రేంజ్‌లో.. దంపతుల పక్కా స్కెచ్‌.. టమాటా లారీ హైజాక్..


 

మరిన్ని వార్తలు