ప్రముఖ ర్యాపర్‌ మృతి, న్యూయార్క్‌ మేయర్‌ సంతాపం

17 Jul, 2021 09:57 IST|Sakshi

న్యూయార్క్: ప్రముఖ ర్యాపర్​ బిజ్ మార్కీ (57) అనారోగ్యంతో కన్నుమూశారు. న్యూయార్క్‌లో జన్మించిన బిజ్ మార్కీ "క్లౌన్ ప్రిన్స్ ఆఫ్ హిప్-హాప్" అనే నిక్‌నేమ్‌తో సంగీత ప్రపంచంలో మంచి పేరును సంపాదించాడు.  బిజ్‌ ఆకస్మిక మరణంపై న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో తన సంతాపాన్ని  తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే పలువురు ర్యాప్‌ సంగీతాభిమానులు, ఇతర గాయకులు బిజ్‌ మృతిపై సోషల్‌ మీడియా ద్వారా సంతాపం వెలిబుచ్చారు.

తన భార్య తార, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆయన మరణించారని రోలింగ్ స్టోన్ పత్రిక నివేదించింది.  అయితే బిజ్‌మరణానికి గల కారణాలను స్పష్టంగా ప్రకటించ లేదు. కానీ టైప్ 2 డయాబెటిస్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న ర్యాపీ  సంబంధిత ఆరోగ్య సమస్యలతోనే కన్నుమూసినట్టు సమాచారం.

కాగా ఇన్నోవేటివ్ అమెరికన్ రాపర్, డీజే, నిర్మాత  కూడా అయిన బిజ్ మార్కీ 1989లో "జస్ట్ ఎ ఫ్రెండ్"తో  బాగా పాపులర్‌ అయ్యాడు. "పికిన్ బూగర్స్"  "చైనీస్ ఫుడ్" వంటి పాటలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.

మరిన్ని వార్తలు